సాధారణంగా పులులు ఒకదానితో ఒకటి పోట్లాడుకోవు.ఈ దాడిలో గాయలయ్యే అవకాశం ఎక్కువ.
అదే జరిగితే అవి చనిపోయే అవకాశం ఉంది.అందుకే చాలా సందర్భాల్లో ఒకదానిపై ఒక దానికి కోపం వచ్చినా కామ్‌గానే ఉంటాయి కానీ ఇటీవల రెండు పులులు దానిపై ఒకటి దాడి చేసుకున్నాయి.
నాగ్‌పూర్ ( Nagpur )సమీపంలోని పెంచ్ టైగర్ రిజర్వ్‌లోని చైపట్టి అనే చోట ఈ టైగర్స్ ఫైట్ వెలుగు చూసింది.టూరిస్టులు ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూశారు.
రెండు ఆడ పులులైన బీ-2, బిందు అనేవి, అక్కడే ఉన్న టూరిస్టుల ముందే పోరాటం చేశాయి! ఈ రెండు పులులు ఒకదానితో ఒకటి ఎంత బలంగా పోరాడాయో అంటే, అక్కడి వాతావరణమే భయంకరంగా మారిపోయింది.
సోషల్ మీడియాలో ఈ టైగర్లకు సంబంధించిన ఓ వీడియో సర్క్యులేట్ అవుతోంది! అందులో అడవిలో రెండు ఆడపులులు సఫారీ వెహికల్స్ కోసం వేసిన రోడ్డును పొదల నుంచి దాటుతున్నట్లుగా చూడవచ్చు.ఈ రెండు పులులు మొదటగా ఫ్రెండ్లీ గానే ఉన్నాయి కానీ రోడ్డు దాటి మరోవైపు పొదల్లోకి వెళ్ళేటప్పుడే ఒక పులి ఇంకొక పులిని ఆపింది అంతే కాదు దానిపై చాలా క్రూరంగా అటాక్ చేసింది.అయితే అది కూడా తిరిగే అటాచ్ చేయడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.
రెండు దాడి చేసుకుని ఆ రహదారిలో కింద పడిపోయాయి తర్వాత లేచాయి అనంతరం ఒక పులి ( tiger )పొదలలో తిరుగుతూ పగలు దాటుకుండా మరొక పులిని ఆపింది.
తన టెరిటరీ అని చెబుతూ ఈ పులి ఇంకొక పులిని ఆ పొదల నుంచి దాటి రాకుండా ఆపు చేసింది.ఇది గమనించిన ఇంకొక పులి వేరొక పొదల్లోకి వెళ్లిపోయింది.దీంతో ఈ రెండింటి మధ్య గొడవ సాల్వ్ అయిపోయింది.
అక్కడ వాహనాలలో వెళ్తున్న వాళ్లకు అది ఒక అనుకోని అనుభవం.రెండు పులులు తమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి చేసిన పోరాడటం చూసి అందరూ షాక్ అయ్యారు.
ఆ పోరాటం కొద్ది సేపే జరిగినా, అక్కడి వాతావరణమే మారిపోయింది.అడవిలోని మిగతా జంతువులు కూడా ఆ పోరాటం చూసి భయంతో పారిపోయాయి.
అంతేకాదు, ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అది మరచిపోలేని అనుభవం.ఇది సినిమాలోని ఫైట్ లాగానే ఉంది అని ఈ వీడియో చూసిన కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
ఐదు నిమిషాలు నేరుగా చూసినవారు లక్కీ టూరిస్టులు అని మరి కొంతమంది పేర్కొంటున్నారు.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.