వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) నటించిన తాజా చిత్రం విశ్వంభర( vishwambhara ).ఈ సినిమాపై యువి సంస్థ ఎంతగానో ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే.
అలాగే మెగా అభిమానులు కూడా ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని భావించారు.ఇకపోతే ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.
కానీ ఈ టీజర్ విడుదల తర్వాత బోలెడన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి.మెగా అభిమానులు కూడా ఈ టీజర్ పై భారీగా ట్రోల్స్ చేశారు.
అయితే రెండు విధాలుగా ట్రోలింగ్స్ జరగగా అందులో ఒకటి క్వాలిటీ ఆఫ్ వి ఎఫ్ ఎక్స్ వర్క్స్ కాగా, ఇక రెండవది వివిధ హాలీవుడ్ సినిమాల నుంచి కాపీ కొట్టి చేశారు అన్న ఆరోపణ కూడా ఒకటి.
ఈ రెండు విషయాలతో ఈ సినిమా టీజర్ పై భారీగా ట్రోల్స్ చేశారు.టీజర్ ఇంతలా బౌన్స్ బ్యాక్ అవుతుందని అనుకోలేదు నిర్మాతలు, కానీ ఇప్పుడు మెగాస్టార్ డ్యామేజ్ కంట్రోల్ మీద దృష్టి పెట్టారు.చికెన్ గునియా కారణంగా విపరీతమైన బాడీ పెయిన్స్ తో బాధపడి, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు మెగాస్టార్.
అందుకోసమే కాస్త విశ్రాంతిలో వున్నారు.టీజర్ కు వచ్చిన ఫీడ్ బ్యాక్ తెలుసుకుని, విఎఫ్ఎక్స్ పనుల గురించి రివ్యూ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అసలు మొదటి నుంచీ విఎఫ్ఎక్స్ పనుల మీద మెగాస్టార్ కు యూనిట్ కు మధ్య కాస్త డిస్కషన్ నడుస్తూనే వుందని తెలుస్తోంది.ఎప్పుడయితే క్వాలిటీ మీద ట్రోలింగ్ జరిగిందో, అప్పుడు బాల్ మెగాస్టార్ కోర్టులోకి వచ్చేసింది.
ఇప్పుడు అయన చెప్పినట్లు వినక తప్పదు, ఎంతయినా మెగాస్టార్ ది అనుభవం.ఇక హాలీవుడ్ సీన్ల నుంచి ఇన్ స్పయిర్ కావడం అన్నది దానికి చేసిది ఏమీ వుండదు.జనానికి నచ్చితే ఎక్కడ నుంచి ఎత్తుకు వచ్చినా పెద్దగా పట్టించుకోరు.విడుదల టైమ్ లో కూడా ఇలా ఇదే విషయం మీద ట్రోలింగ్ జరిగినా పెద్దగా పట్టించుకోరు.
అందువల్ల అదేమీ పెద్ద సమస్య కాకపోవచ్చు.ఇప్పుడు ఎలాగూ సినిమా విడుదల వెనక్కు వెళ్లిపోయింది కనుక, టైమ్ తీసుకుని కరెక్షన్స్ చేసుకుంటారేమో? చూడాలి మరి.