ప్రదీప్ మాచిరాజు( Pradeep Machiraju ).రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు ఈయన గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.
బుల్లితెరపై తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొన్న ప్రదీప్ అంచలంచలుగా ఎదుగుతూ సినీ హీరోగా మారిపోయాడు.బుల్లితెరపై తెలుగు యాంకర్ల విషయానికొస్తే.
సుమ కనకాల ముందు వరుసలో ఉంటే, ఆ తర్వాత గుర్తొచ్చే పేరు.ప్రదీప్ మాచిరాజు.
తనదైన కామెడీ టైమింగ్ తో ప్రజలను నవ్విస్తూ ఉంటూ.యాంకరింగ్ చేయడం అతని స్పెషాలిటీ.
నిత్యం పలు టీవీ షో లతో బిజీగా ఉండే ప్రదీప్ ఈ మధ్యకాలంలో బుల్లితెరపై కనిపించడం కాస్త తక్కువ అయిందని చెప్పవచ్చు.ప్రస్తుతం యాంకర్ ప్రదీప్ ఆచితూచి అడుగులు వేస్తున్నాడన్న విషయం అర్థమవుతుంది.
దీని కారణం అతడు హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.ఇందుకోసం అతడు అనేక సినిమా కలలు వింటూ ఉన్నాడు.
ఇదివరకు యాంకర్ ప్రదీప్ ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే లవ్ స్టోరీని ఎంచుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.అయితే ఆ సినిమా హీరోకి కమర్షియల్ సక్సెస్ ఇవ్వలేకపోయింది.దాంతో ఎక్కువగానే గ్యాప్ తీసుకొని తన రెండో సినిమాను చేసేందుకు ప్రదీప్ సిద్ధం అయ్యాడు.సిద్ధమయ్యాడు అంటే కాదండోయ్.ఏకంగా సినిమా పూర్తి చేశాడని చెప్పవచ్చు.ఎట్టకేలకు ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి అందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Power Star Pawan Kalyan )మొదటి సినిమా టైటిల్ ను తన రెండో సినిమా టైటిల్ గా పెట్టుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’( Akkada Ammay Ekada Abbay ) అనే టైటిల్ తో ఓ మోషన్ పోస్టర్ను రిలీజ్ చేశారు.ఈ సినిమా కోసమే కాబోలు గత కొన్ని నెలలుగా ప్రతి టీవీ షోలకు దూరంగా ఉన్నాడు అనిపిస్తోంది.
ఇకపోతే జబర్దస్త్ తో పాటు మరికొన్ని టీవీ షోలకు డైరెక్ట్ చేసిన భరత్, నితిన్ లు ఈ సినిమాతో దర్శకులుగా పరిచయం అవుతున్నారు.సినిమా సంబంధించి షూటింగ్ దాదాపుగా పూర్తయిందని సమాచారం.దీంతో ఈ సినిమాను మూవీ మేకర్స్ డిసెంబర్ నెలలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.ఇక పలు కామెడీ షోస్ లో యాంకర్ కం డాన్సర్ గా పని చేసిన దీపికా పిళ్లై హీరోయిన్గా చేసింది.
చూడాలి మరి పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ తో వస్తున్న యాంకర్ ప్రదీప్ ఈసారైనా విజయం సాధిస్తాడో లేదో.