గన్నవరంలో విమానాశ్రయ నిర్వాసితుల ఆందోళన..

కృష్ణా జిల్లా గన్నవరంలో విమానాశ్రయ నిర్వాసితులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.ఈ క్రమంలో ఉంగుటూరు – గన్నవరం ప్రధాన రహదారిపై నిరసనకు దిగారు.

 Concern Of Airport Residents In Gannavaram..-TeluguStop.com

రోడ్డుపై బైఠాయించి పురుగుల మందు డబ్బాలతో నిర్వాసితులు ఆందోళన నిర్వహించారు.గత ఏడేళ్లుగా సమస్యను పరిష్కరించడం లేదని దావాజీగూడెం, బుద్ధవరం, అల్లాపురం బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు.

దీంతో ట్రాఫిక్ అంతరాయం కలగడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఈ నేపథ్యంలో స్వల్ప ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube