గన్నవరంలో విమానాశ్రయ నిర్వాసితుల ఆందోళన..

గన్నవరంలో విమానాశ్రయ నిర్వాసితుల ఆందోళన

కృష్ణా జిల్లా గన్నవరంలో విమానాశ్రయ నిర్వాసితులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.ఈ క్రమంలో ఉంగుటూరు - గన్నవరం ప్రధాన రహదారిపై నిరసనకు దిగారు.

గన్నవరంలో విమానాశ్రయ నిర్వాసితుల ఆందోళన

రోడ్డుపై బైఠాయించి పురుగుల మందు డబ్బాలతో నిర్వాసితులు ఆందోళన నిర్వహించారు.గత ఏడేళ్లుగా సమస్యను పరిష్కరించడం లేదని దావాజీగూడెం, బుద్ధవరం, అల్లాపురం బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గన్నవరంలో విమానాశ్రయ నిర్వాసితుల ఆందోళన

అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు.

దీంతో ట్రాఫిక్ అంతరాయం కలగడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఈ నేపథ్యంలో స్వల్ప ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

మళ్లీ ఆ బాలీవుడ్ హీరోయిన్ కు ఛాన్స్ ఇస్తున్న బాలకృష్ణ.. అసలేం జరిగిందంటే?

మళ్లీ ఆ బాలీవుడ్ హీరోయిన్ కు ఛాన్స్ ఇస్తున్న బాలకృష్ణ.. అసలేం జరిగిందంటే?