సీఎం కేసీఆర్ వాగ్దాటి గురించి అందరికీ తెలిసిందే.ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదనుకుంట.
ఏకధాటిగా రెండు నుంచి నాలుగు గంటలు మాట్లడుమన్నమాట్లాడే కెపాసిటీ ఉన్నలీడర్.అయితే, ఈ మధ్య కేసీఆర్ పెట్టే ప్రెస్ మీట్లలో తెలంగాణ సమాజానికి ఏం చేస్తున్నారో చెప్పకుండా కేంద్రంపై తీవ్రంగా విరుచుకపడుతున్నారు.
ఇటీవల నాన్ స్టాప్‌గా 2 గంటలు కేంద్రం, ప్రధాని మోడీ విధానాల పట్ల దుమ్మెత్తిపోశారు.జీఎస్టీ పన్నువిధానం, ఏక్ నాధ్ షిండే, మేక్ ఇన్ ఇండియా, నీతి అయోగ్, కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు ఇలా ఒక్కో అంశంపై కేంద్రాన్ని టార్గెట్ చేశారు సీఎం కేసీఆర్.
తాను ఏది మాట్లాడిన నిక్కచ్చిగా మాట్లాడతానని, ఎవరికి జంకే వక్తిని కాదని చెప్పుకుంటున్న కేసీఆర్ మొన్నటివరకు జాతీయరాజకీయాలపై దృష్టి సారించారు.మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే కేంద్రంలో బలమైన అలయెన్స్ అవసరమనే నిర్ణయానికి వచ్చారు.
ఈ నేపథ్యంలోనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలసి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు.రాష్ట్రపతి ఎన్నికల్లోనూ కేంద్రానికి వ్యతిరేకంగా వెళ్లారు.ప్రధాని మోడీ హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వస్తున్నారని తెలిసి ప్రధానిని కలువకుండా.రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను కలిసి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.
ఇలా కేసీఆర్ కేంద్రాన్ని ఢీకొట్టాలని చేసిన ప్రతి వ్యూహం బెడిసి కొట్టింది.

దీనికి తోడు తాజాగా రాష్ట్రంలో ఈడీ దాడులు మొదలవ్వడంతో కేసీఆర్ అందుకు తగ్గట్టే ప్రెస్ మీట్లు పెట్టి కేంద్రప్రభుత్వాన్ని, రాష్ట్రంలోని బీజేపీ నేతలకు తనతో పెట్టుకుంటే మిగిలేది బూడిదే అని హెచ్చరికలు సైతం జారీచేశారు.అయితే ఈడీ దాడుల భయంతోనే కేసీఆర్ మేకపోతు గంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని రాష్ట్రంలోని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టిన కేసీఆర్ నీతిఅయోగ్ ఉత్తదే అని. దాని పనివిధానం బాలేదని.రాష్ట్రానికి నిధులు కేటాయించడం లేదని విమర్శించారు.
అందుకు నిరసనగా నీతిఅయోగ్ సమావేశానికి హాజరుకానని తేల్చిచెప్పారు.

అయితే, కేసీఆర్ చెప్పినవన్నీ నిజాలైతే రాష్ట్రంలో ప్రెస్‌మీట్ పెట్టి కేంద్రంపై విరుచుకపడే బదులు ఢిల్లీ వెళ్లి నీతి అయోగ్ సమావేశంలో మా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని నేరుగా ప్రధాని మోడీని ప్రశ్నిస్తే బాగుంటుంది కదా? అని విపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.కేసీఆర్కు మోడీ అంటే భయం అని, ఆయన మొహం చూడటానికి కూడా కేసీఆర్ భయపడుతున్నాడని అందుకే ఇలా ప్రెస్‌మీట్లు పెట్టి తన ఫ్రస్టేషన్ తీర్చుకుంటున్నాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.వాస్తవానికి నీతిఅయోగ్ మీటింగ్‌కు వెళితేనే రాష్ట్ర సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, కేసీఆర్ ప్రజల గురించి ఆలోచించకుండా ఈగోలకు పోయి సమావేశాన్ని బహిష్కరించి తెలంగాణ అభివృద్ధిని నాశనం చేస్తున్నాడని పలువురు మేధావులు, విద్యార్థి సంఘాలు కూడా ఆరోపిస్తున్నాయి.