కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక నిర్ణయం తీసుకోనురా..?

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం ఏర్పడింది.ఇప్పటికే ఈ ప్రభుత్వం ఏర్పడి 15 రోజులు గడిచింది.

 Cm Revanth Reddy's Meeting With The Collectors Will Not Take A Key Decision , Ar-TeluguStop.com

దీంతో వారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలలో భాగంగా 6 గ్యారంటీలలో రెండు గ్యారెంటీలు అయినటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అలాగే ఆరోగ్యశ్రీ ( Arogyashri )అనే పథకాలను అమలు చేశారు.అంతేకాకుండా ఇంకా నాలుగు గ్యారెంటీలను కూడా అమలు చేసే యోచనలో ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

ఇదే తరుణంలో రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత తొలిసారి కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి ముఖ్యంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క( Deputy CM Batti Vikramarka ), మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, దామోదర్ రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పాల్గొన్నారు.

సీఎం ఇతర మంత్రులతో ఇది మొదటి మీటింగ్ కాబట్టి ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.ముఖ్యంగా ప్రజలకు ఈ మీటింగ్ పై ఎన్నో ఆశలు ఉన్నాయి.

Telugu Guarantees, Arogyashri, Ministers, Deputycm, Telangana-Telugu Political N

ఈ మీటింగ్ తర్వాత క్యాబినెట్ మినిస్టర్స్( Cabinet Ministers ) ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారని దానిపై ఆసక్తి నెలకొంది.ముఖ్యంగా ఈ మీటింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను ప్రజల వద్దకు ఎలా తీసుకెళ్లాలని చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలు చేశారు.ఇదే తరుణంలో మిగతా నాలుగు గ్యారంటీలకు కూడా వీలైనంత త్వరగా అమలు చేయడం కోసం కలెక్టర్లు సన్నాహాలు రెడీ చేయాలని వారికి ఆదేశాలు జారీ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇందులో ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులు, రూ:500 కే గ్యాస్ సిలిండర్ అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

Telugu Guarantees, Arogyashri, Ministers, Deputycm, Telangana-Telugu Political N

అంతే కాకుండా ఈనెల 28వ తేదీ నుంచి ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి గ్రామంలో అర్హులైన వారికి రేషన్ కార్డులు అందించడం కోసం ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు సమాచారం.ఒకవేళ ఇది అనుకున్నట్టు జరిగితే మాత్రం కొత్త సంవత్సరంలో రేషన్ కార్డు లేని ప్రతి ఒక్కరికి కార్డులందుకునే అవకాశం కనిపిస్తోంది.అంతేకాకుండా ఇంకా కొన్ని నెలల్లో పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయి.

కాబట్టి ఈ 6 గ్యారెంటీలు అమలు చేసి పార్లమెంట్ ఎలక్షన్స్ లో సత్తా చాటాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube