వారిని సూపర్ స్ప్రెడర్స్ గా గుర్తింపు.. స్పెషల్ డ్రైవ్ గా వ్యాక్సినేషన్..!

తెలంగాణాలో వ్యాక్సినేషన్ ప్రక్రియని వేగవంతం చేశారు.ఇప్పటికే కోవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్ లు అందిస్తున్న విషయం తెలిసిందే.

 Kcr Ordered Vaccination For Corona Super Spreaders, Cm Kcr, Corona, Corona Vacci-TeluguStop.com

అయితే ఇప్పటివరకు 45 ఏళ్లు పై బడిన వారికి వ్యాక్సిన్ అందించగా త్వరలో 18 నుండి 44 ఏళ్ల వయసు గల వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ అందిస్తారని తెలుస్తుంది.ఈ క్రమంలో కొందరిని సూపర్ స్ప్రెడర్స్ గా గుర్తించి స్పెషల్ డ్రైవ్ గా కొందరికి ముందుగా వ్యాకిన్ వేయించాలని ఆదేశించారు తెలంగాణా సిఎం కే.

సి.ఆర్.

సూపర్ స్ప్రెడర్స్ గా ఉన్న కూరగాయల వ్యాపారులు, ఆర్టీసి కండక్టర్లు, డ్రైవర్లు, డెలివెరీ బోయ్స్, సేల్స్ మెన్లను గుర్తించి వారందరికి టీకాలను అందచేయాలని నిర్ణయించారు.జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన ఈ స్పెషల్ వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించాలని కే.సి.ఆర్ ఆదేశించారు.అంతేకాదు అన్ని జిల్లాలకు వెళ్లి అక్కడి పరిష్తితులను పరిశీలించాలని ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీని ఆదేశించారు.ప్రస్తుతం తెలంగాణాలో లాక్ డౌన్ కొనసాగుతుంది.మే 30 వరకు ఈ లాక్ డౌన్ కొనసాగుతుంది.ఈ క్రమంలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా నడిపిస్తున్నారు.ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే వాహనాలకు అనుమతి ఇవ్వగా.10 దాటిన తర్వాత లాక్ డౌన్ ను కఠినతరం చేస్తున్నారు. అత్యవసర పని కాకుండా లాక్ డౌన్ టైం లో సరదాగా బయటకు వస్తే మాత్రం వాహనాలను సీజ్ చేస్తున్నారని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube