తమ జాతీయ పార్టీ బిఆర్ఎస్ ను దేశ రాజకీయాల్లో కీలకం చేసేందుకు ఆ పార్టీ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ ముమ్మరంగానే ప్రయత్నాలు చేస్తున్నారు.దేశవ్యాప్తంగా బిజెపికి ప్రత్యామ్నాయంగా బి.
ఆర్.ఎస్ ను ప్రమోట్ చేసే పనుల్లో ఆయన నిమగ్నమయ్యారు.ఇప్పటికే కొన్ని రాష్ట్రాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.ఇక తమ సొంత గడ్డ అయిన తెలంగాణలోనూ బీఆర్ఎస్ ప్రభావం మరింత ఎక్కువ కనిపించేలా ప్రయత్నాలు చేస్తున్నారు.ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభను భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈనెల 18వ తేదీన ఖమ్మంలో సభ జరగనుంది.
దాదాపు 5 లక్షల మందితో ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభను నిర్వహించి తమ బలాన్ని నిరూపించుకునేందుకు కేసిఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ ను కేసీఆర్ నియమించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఖమ్మం బిఆర్ ఎస్ ఆవిర్భావ సభకు ఏపీ నుంచి భారీగా జనాలను తీసుకువచ్చే బాధ్యతను కొత్త అధ్యక్షుడికి కేసిఆర్ అప్పగించారు.దాదాపు లక్ష మందిని ఈ ఆవిర్భావ సభకు తరలించాలని టార్గెట్ విధించారు.
అసలు ఏపీ నుంచి భారీగా జనాలను తీసుకురావాలనే ఉద్దేశంతోనే అక్కడ సభను ఏర్పాటు చేసినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక జనాలను తరలించేందుకు ఎటువంటి సహాయం కావాల్సిన బీఆర్ఎస్ తరఫున చేస్తామని, లక్షకు తగులుండ జనాలను సమీకరించాలని కెసిఆర్ టార్గెట్ విధించారట.ఇప్పటికే బీఆర్ఎస్ ఫ్లెక్సీలను ఏపీ అంతటా భారీగా ఏర్పాటు చేశారు.ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ కేసీఆర్, తోట చంద్రశేఖర్ అలాగే మాజీ మంత్రి రావెల్ కిషోర్ బాబు ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు ఏపీ లోని ముఖ్యమైన కూడళ్లలో వెలిశాయి.
అయితే స్థానిక నేతల ఫోటోలు , పేర్ల తో అక్కడక్కడా ఫ్లెక్సీ లు వెలిసిన మెజార్టీ సంఖ్యలో బోర్డుల ఏర్పాటు ప్రక్రియను అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీకి అప్పగించినట్లుగా అర్థమవుతుంది.ఏపీలో పార్టీ ఇంకా పుంజుకోలేదు.చేరికలు అంతంత మాత్రమే అన్నట్టు గా ఉన్నాయి.దీంతో ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ఏపీ నుంచి లక్ష మందిని తరలించడం అంటే అది మామూలు విషయం కాదు అని తెలిసినా, ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కు ఈ టార్గెట్ ను విధించి ఆయనకు పెద్ద పరీక్షే పెట్టారు.