పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయంగా పేపర్ ప్యాకింగ్‌లు అందుబాటులోకి వచ్చేశాయి.నిజానికి పేపర్ వాటర్‌బాటిళ్లు, ఇంకా ఇతర సీసాల తయారు చేయాలనే ఆలోచన 20 ఏళ్ల కిందటే వచ్చింది.
ప్యాకేజింగ్ డిజైనర్ జిమ్ వార్నర్ పదేళ్లపాటు ఎంతో రీసెర్చ్ చేసి చెరుకు, వెదురు గుజ్జుతో 2015లో మొదటిసారిగా పేపర్ వాటిల్ బాటిల్ తయారు చేశాడు.అలానే ఒక కంపెనీని స్థాపించాడు.
అదే టైమ్‌లో పేపర్ బాటిళ్లను తయారుచేసే పాబొకొ కంపెనీ కూడా అవతరించింది.ఈ కంపెనీతో చేతులు కలిపిన డ్యానిష్ బీర్ తయారీ సంస్థ కాల్జ్‌బర్గ్ రీసైకిల్డ్ చెక్కముక్కలతో మొట్టమొదటి పేపర్ బీర్ బాటిల్‌ను అందుబాటులోకి తెచ్చింది.
లొరియల్, ఆబ్‌సల్యూట్ వంటి కాస్మెటిక్ కంపెనీలు కూడా పేపర్‌తో తయారు చేసిన బాటిల్స్ తీసుకొచ్చే ప్రయత్నాలను మొదలుపెట్టాయి.శీతల పానీయాల తయారీ దిగ్గజ కోకకోలా కూడా పాబొకొ కంపెనీ సాయంతో కూల్‌డ్రింకులను రీసైకిల్ చేయగలిగే పేపర్ బాటిల్స్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది.100% నేలలో కలిసిపోయి పర్యావరణానికి జీరో శాతం హాని చేసే పేపర్ బాటిల్‌ను పల్పెక్స్-పెప్సికొ కంపెనీలు ఆల్రెడీ డిజైన్ చేశాయి.
వాటర్ సీసాలు, లిక్విడ్ సోప్, షాంపూ, లోషన్లు ఇలా బాగా అమ్ముడుపోయే వస్తువులను పేపర్ సీసాలలోనే అందించాలనే ఉద్దేశంతో భారతీయ సంస్థ కాగ్జి బాటిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటయింది.వాడి పడేసిన పేపర్ గుజ్జుతో ఈ బాటిళ్లను ఈ కంపెనీ తయారు చేస్తోంది.ఇవి నీటితో పాటు ఇంకా ఇతర ద్రవాలను నింపుకునేందుకు వీలుగా ఉంటాయి.
ఐస్‌క్రీమ్ కప్పులు, కాఫీ, టీ మగ్గులు, స్ట్రాలు, ప్లేట్లూ, బీరు సీసాలు కూడా పేపర్ తోనే తయారు చేయడం మొదలుపెట్టాయి కొన్ని కంపెనీలు.