శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా స్థానిక జడ్పీటీసీ సభ్యురాలు దువ్వాడ వాణి ని ఖరారు చేసినట్లు ఆమె భర్త , ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేసారు .గత నెల ముఖ్య మంత్రి జగన్ జిల్లా పర్యటనలో భాగంగా దువ్వాడ శ్రీనివాస్ పేరును ప్రకటించారు .
దువ్వాడ శ్రీనివాసే టెక్కలి అభ్యర్థి అని అపోహలు ఉంటె పార్టీ కి నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్వయంగా ముఖ్య మంత్రి నౌపడలో జరిగిన బహిరంగ సభలో ప్రకటించారు .ఇది జరిగిన నెల రోజుల్లోనే ఆయన సతీమణి దువ్వాడ వాణి పేరు ను ప్రకటించడంతో టెక్కలి పార్టీ శ్రేణులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
అయితే ఇటీవల కాలంలో దువ్వాడ శ్రీనివాస్,వాణి దంపతుల మద్య విభేదాలు ఉన్నట్లుగా టెక్కలి నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది .ఆ ప్రచారం అంతా తప్పుడు ప్రచారమని మీడియా సమావేశం పెట్టి ఎంఎల్ సి దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి జడ్పిటీసి సభ్యురాలిగా ఉన్న వాణి దంపతులు తమ మద్య విభేదాలు లేవని టెక్కలిలో ఎమ్మెల్యేగా శ్రీనివాస్ పోటీ చేస్తే తమ కుటుంబ సభ్యులంతా కూడా కష్టపడి పనిచేసి రికార్డు మెజార్టీతో ఆయనను గెలిపించుకునేందుకు కృషి చేస్తామని దువ్వాడ వాణి పేర్కొన్నారు.దువ్వాడ వాణిని ఇప్పుడు ఇన్ చార్జిగా నియమించడంతో నియోజకవర్గం లోని నేతలు వారి అనుచరులు అయోమయంలో పడ్డారు.