జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు అంటూ కోర్టుకు సీబీఐ విజ్ఞప్తి..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13 వ తారీకు ఎన్నికల జరగనున్నాయి.జూన్ 4వ తారీఖు ఫలితాలు.

 Cbi Appeals To The Court Not To Give Permission For Jagan Foreign Tour Details,-TeluguStop.com

వచ్చే సోమవారమే పోలింగ్. ప్రస్తుతం ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలో భారీ ఎత్తున పాల్గొంటున్నారు.

ఈ క్రమంలో ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూ ప్రజలకు సంచలన హామీలు ప్రకటిస్తున్నారు.ఇదిలా ఉంటే ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతు సడలించాలని ఇటీవల నాంపల్లి సీబీఐ కోర్టులో( Nampally CBI Court ) దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.

బ్రిటన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించడానికి అనుమతి ఇవ్వాలని కోరడం జరిగింది.దీనిపై నిన్న విచారణ జరిపిన సీబీఐ( CBI ) న్యాయస్థానం కౌంటర్ ఆఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో సీబీఐ నేడు కోర్టులో తమ వాదనలు వినిపించింది.ఏపీ సీఎం వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని నాంపల్లి కోర్టుకు సీబీఐ విజ్ఞప్తి చేసింది.అక్రమాస్తుల కేసు విచారణ కొనసాగుతున్నందుకు ఆయనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కోరింది.ఇప్పటికే ఓసారి విదేశాలకు వెళ్లొచ్చారని గుర్తుచేసింది.కాగా దీనిపై తదుపరి విచారణ మే 14న ఉంటుందని పేర్కొంది.ఏపీలో మే 13న పోలింగ్ జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

ఈ వ్యవధిలో కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ భావించారు.ఈ క్రమంలో కోర్టు పర్మిషన్ తీసుకోవాలని పిటీషన్ వెయ్యగా సీబీఐ.

అనుమతి ఇవ్వొద్దని.కౌంటర్ దాఖలు చేయటం సంచలనంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube