టీడీపీకి షాక్ ఇస్తున్న అభ్య‌ర్థులు.. అధినేత ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని ఆవేద‌న‌

ఏ రాజ‌కీయ పార్టీకి అయినా స‌రే గ్రౌండ్ లెవ‌ల్ లో ప‌ట్టు ఉంటేనే అధికారం ద‌క్కుతుంది.ఈ విష‌యం టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయడుకు తెలియ‌నిది కాదు.

 Candidates Giving Shock To Tdp.. The Chief Complained That He Did Not Care, Chan-TeluguStop.com

కానీ ఆయ‌న గ‌త రెండున్న‌రేండ్లుగా గ్రౌండ్ లెవ‌ల్ లో పార్టీని బ‌లోపేతం చేసేందుకు పెద్ద‌గా కృషి చేయ‌ట్లేదు.గ్రౌండ్ లెవ‌ల్ లో పార్టీ బ‌లంగా ఉండాలంటే స‌ర్పంచులు, ఎంపీటీసీలు, జ‌డ్పీటీసీలు, మున్సిపాలిటీ కౌన్సిల‌ర్లే కీల‌కం.

వారు లేక‌పోతే గ్రామాల్లో పార్టీకి ప‌ట్టు ఉండదు.కానీ చంద్ర‌బాబు నాయుడు ఈ ఎన్నిక‌ల్లో త‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను గెలిపించుకోవ‌డంలో ఫెయిల్ అయ్యారు.

త‌మ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసే స‌ర్పంచుల‌ను, ఎంపీటీసీల‌ను.జ‌డ్పీటీసీల‌ను గెలిపించుకోవ‌డంలో చంద్ర‌బాబు అంత‌గా ఫోక‌స్ పెట్ట‌లేద‌ని త‌మ్ముళ్లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.ముఖ్యంగా ఏ ఎన్నిక‌ల్లో అయినా త‌మ అభ్య‌ర్థుల‌ను గెలిపించుకునేందుకు పార్టీలు ఖ‌ర్చు పెట్ట‌డం ప‌రిపాటిగా మారిపోయింది.అదే వైసీపీని చూస్తే త‌మ పార్టీ త‌ర‌ఫున ఎవ‌రు పోటీ చేసినా గెలిపించుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఓ రేంజ్ లో పార్టీ త‌ర‌ఫున ఖ‌ర్చు పెడుతున్నారు.

కానీ చంద్ర‌బాబు మాత్రం దీనిపై పెద్ద‌గా దృష్టి సారించ‌ట్లేదు.

Telugu Ap, Candisshock, Chandrababu, Cm Jagan, Ysrcp-Telugu Political News

ఇలా టీడీపీ వారికి డబ్బులు పెట్ట‌క‌పోవ‌డంతో చాలామంది త‌మ‌కు ఖ‌ర్చు పెట్టే స్థోమత లేని వారు పోటీ నుంచి త‌ప్పుకుంటున్నారు.ఇంత‌కు ముందు రాష్ట్ర వ్యాప్తంగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఇదే సీన్ క‌నిపిస్తే ఇప్పుడు జ‌రుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఇదే సీన్ క‌నిపిస్తోంది.ఇప్ప‌టికే టీడీపీ త‌ర‌ఫున నామినేష‌న్ వేసిన 54 మందిలో 11 మంది ఉప‌సంహ‌రించుకున్నారంటేనే ప‌రిస్థితి అర్థ‌మ‌వుతోంది.గ్రౌండ్ లెవ‌ల్ లో పార్టీని న‌డిపించే వారి మీద దృష్టి సారించ‌లేక‌పోవ‌డంతో చంద్ర‌బాబుకు వారంతా షాక్ ఇస్తున్నారు.

ఇది పార్టీకి పెద్ద న‌ష్ట‌మ‌నే చెప్పాలి.రాబోయే రోజుల్లో ఇది అధికారాన్ని ద‌క్కించుకోవ‌డంలో పెద్ద ప్ర‌భావం చూపిస్తుంద‌నే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube