ఉమాంగ్‌ యాప్‌లో ఇలా సులువుగా పీఎఫ్‌ డ్రా చేసుకోవచ్చు!

సాధారణంగా జాబ్‌ రిటైర్మెంట్‌ తర్వాత పీఎఫ్‌ డబ్బుల కోసం దరఖాస్తు చేసుకుంటారు.దానికి మీకు సంబంధించిన ఈపీఎఫ్‌ఓ ఆఫీసుల్లో డైరెక్ట్‌గా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది.

 Can Withdraw Pf Amount Easily With Umaang App, Carona , Employees Epf, Epfo Job-TeluguStop.com

లేకపోతే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్‌ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

దీనికి మీ వద్ద రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ ఉండాలి.దీంతో పాటు సంబంధిత బ్రాంచ్‌ ఐఎఫ్‌ఎసీ కోడ్, బ్యాక్‌ ఖాతా నంబర్‌ అలాగే పాన్‌ కార్డు నంబర్‌ను కూడా కేవైసీ చేసి ఉండాలి.

దీంతోపాటు మీ ఎంప్లాయి డేట్‌ ఆఫ్‌ ఎగ్జిట్‌ కూడా పెట్టి ఉండాలి.

దీంతో 15 రోజుల్లో మీ ఖాతాలో డబ్బులు జమ అయిపోతాయి.

కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న దానికంటే ఇది తక్కువ సమయం.అయితే, ఈ రెండు కాకుండా పీఎఫ్‌ విత్‌డ్రా చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉమాంగ్‌ యాప్‌ ద్వారా కూడా డబ్బులు విత్‌ డ్రా చేసుకోవచ్చు.

ఆ వివరాలు తెలుసుకుందాం.ఈ యాప్‌లో అన్ని ప్రభుత్వ సేవలు పొందవచ్చు.

Telugu Carona, Centaral, Pf Amount, Employees, Epfo, Job-Latest News - Telugu

దీనికి ముందుగా మీ స్మార్ట్‌ ఫోన్‌లో ప్లే స్టోర్‌ నుంచి ఉమాంగ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.– మీ పీఎఫ్‌ ఖాతాకు సంబంధించిన వివరాలతో లాగిన్‌ అవ్వాలి.– ఆ తర్వాత యాప్‌లోని ఈపీఎఫ్‌ఓ సెక్షన్‌పై క్లిక్‌ చేయాలి.– తరువాత ఎంప్లాయీ సెంట్రిక్‌ సర్వీసెస్‌లో క్లెయిమ్‌ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.– ఒకవేళ మీరు కొవిడ్‌ 19 అడ్వాన్స్‌ తీసుకోవాలంటే పాప్‌ అప్‌లో ఆ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.– ఆ తర్వాత యూఏఎన్‌ నంబర్‌తో ఓటీపీ జనరేట్‌ చేయాలి.

– అప్పుడు మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.దాన్ని ఎంటర్‌ చేయాలి.

రిక్వెస్ట్‌ను సబ్మిట్‌ చేయాల్సి ఉంటుంది.ఆరోగ్యం, పెళ్లి లాంటి వాటికి కూడా ఇదే విధంగా దరఖాస్తు చేసుకోవాలి.

– అప్పుడు మీకు క్లెయిమ్‌ రిఫరెన్స్‌ నంబర్‌ వస్తుంది.దీని ద్వారా మన విత్‌ డ్రా స్టేటస్‌ను చెక్‌ చేసుకోవచ్చు.

Telugu Carona, Centaral, Pf Amount, Employees, Epfo, Job-Latest News - Telugu

దాదాపు పది పదిహేను రోజుల్లో మీ ఖాతాల్లోకి డబ్బు జమ అయిపోతుంది.లేకపోతే దరఖాస్తులో ఏదైనా లోపం ఉంటే కూడా పీఎఫ్‌ అధికారులు కారణాన్ని తెలియజేస్తూ అప్డేట్‌ చేస్తారు.దీంతో మీరు తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube