యాదాద్రి ఆలయంలో భక్తులకు అందుబాటులో బ్రేక్ దర్శనం..!

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బ్రేక్‌ దర్శనం భక్తులకు త్వరలో చేరువకానుంది.తిరుమల తరహాలో వీవీఐపీ, వీఐపీలకు ప్రత్యేకమైన దర్శనాన్ని కల్పించేందుకు ఆలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

 Break Darshan Is Available For Devotees In Yadadri Temple..!-TeluguStop.com

కాగా, ప్రధానాలయ ఉత్తర పంచతల రాజగోపురం గుండా వెలుపలి ప్రాకార మండపంలో, త్రితల రాజగోపురం గుండా ఆలయంలోకి ప్రవేశించే విధంగా క్యూలైన్లను ఏర్పాటు చేయనున్నారు.ప్రతిరోజు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు బ్రేక్‌ దర్శనం కల్పించనున్నారని ఆలయ ఈవో తెలిపారు.బ్రేక్‌ దర్శన సమయంలో ధర్మ దర్శనం, రూ.150 దర్శనం నిలిపివేయనున్నట్టు పేర్కొన్నారు.బ్రేక్‌ దర్శనానికి ఒక్కొక్కరికి రూ.300 ఉంటుందన్నారు.బ్రేక్‌ దర్శనంలో వచ్చే భక్తులకు స్వయంభూ మూర్తుల దర్శనంతోపాటు గర్భాలయంలో హారతిని ఇవ్వనున్నట్టు వెల్లడించారు.దీనిపై త్వరలోనే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రానున్నాయని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube