ఏపీలో 2024లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు టీడీపీ( TDP ) అత్యంతకీలకమని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.అందుకే ఈసారి ఎలాగైనా గెలవాలని అధినేత చంద్రబాబు నాయుడు పట్టుదలగా ఉన్నారు.
అందుకు తగ్గట్టుగానే వ్యూహరచన చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.అయితే ఈసారి కూడా టీడీపీ గెలవడం కష్టమే అని దాదాపు ఇప్పటివరకు వచ్చిన అన్నీ సర్వేలు ఒకే విధంగా చెబుతూ వచ్చాయి.
వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని.అసెంబ్లీ సీట్లలోనూ అటు లోక్ సభ సీట్లలోనూ వైసీపీ సత్తా చతుతుందని సర్వేలు చెబుతూ వచ్చాయి.
![Telugu Ap, Chandrababu, Mood, Lokesh, Ysjagan-Latest News - Telugu Telugu Ap, Chandrababu, Mood, Lokesh, Ysjagan-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2023/08/ycp-YS-Jagan-Mohan-Reddy-Chandrababu-Naidu-ap-politics.jpg)
అయితే సర్వేలన్నీ బోగస్ అని జగన్( YS Jagan Mohan Reddy ) పాలనపై ప్రజా వ్యతిరేకత ఉందని వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతూ వచ్చారు.ఇక తాజాగా బయటకు వచ్చిన ఒక సర్వే మాత్రం టీడీపీకి మంచి బూస్టప్ ఇస్తోంది.తాజాగా మూడ్ ఆఫ్ ది నేషన్( Mood of the Nation ) పేరుతో ఇండియా టుడే ఒక సర్వే నిరవహించింది.ఈ సర్వే వెల్లడించిన ఫలితాల ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ 24 లోక్ సభ స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని తెలిపింది.
దీంతో ప్రజానాడీని ఈ సంస్థ కరెక్ట్ గా అంచనా వేసిందని టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
![Telugu Ap, Chandrababu, Mood, Lokesh, Ysjagan-Latest News - Telugu Telugu Ap, Chandrababu, Mood, Lokesh, Ysjagan-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2023/08/ycp-YS-Jagan-Mohan-Reddy-Chandrababu-Naidu-ap-politics-nara-lokesh.jpg)
అయితే ఆ మద్య నవభారత్ పేరుతో టైమ్స్ నౌ చేసిన సర్వేలో టీడీపీ ఒకే ఒక్క లోక్ సభ సీటు సొంతం చేసుకుంటుందని తెలిపింది.దీంతో ఏ సర్వేను నమ్మలో అర్థం కానీ పరిస్థితి చాలమందిలో ఉంది.సర్వేలు చెబుతున్నా దాని ప్రకారం చూస్తే ఏపీలో గెలుపును అంచనా వేయడం కష్టమే అని విశ్లేషకులు చెబుతున్నారు.
ఏది ఏమైనప్పటికి ఈ తాజా సర్వేతో టీడీపీలో కొంత జోష్ నెలకొనిందనే చెప్పాలి.ప్రస్తుతం జగన్ పాలనలోని వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నా టీడీపీ నేతలు ఇప్పటికే మినీ మేనిఫెస్టో ప్రకటించి ఎలక్షన్ రేస్ లో అందరికంటే ముందు వరుసలో ఉన్నారు.
మరి సర్వేలకు సైతం అంతు చిక్కని విఃదంగా ప్రజాభిప్రాయం ఉండడంతో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో చూడాలి.