రాజన్న సిరిసిల్ల జిల్లా: దేశంలో ప్రజాస్వామ్యం రాజ్యాంగం రక్షించాలంటే మతోన్మాద బీజేపీ ని వచ్చే సార్వత్రిక ఎన్నికలలో గద్దె దించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్ వెస్లీ పిలుపునిచ్చారు.నెహ్రు నగర్ భవాని ఫంక్షన్ హాల్ లో సీపీఎం జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ పదేండ్ల పాలనలో ప్రపంచ ఆకలి సూచిలో 111వ,స్థానంలోకి తెచ్చారని ఏటా 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన వాగ్దానం అమలు చేయలేదన్నారు.29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4లేబర్ కోడ్ లు తెచ్చి పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తుందన్నారు.అంబానీ ఆధాని ల ఆర్ధీకాభివృద్ధిని దేశ అభివృద్ధి గా చూపిస్తుo దన్నారు.పదేళ్లలో ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి పక్కద్రోవ పట్టించేవిధంగా మతవిద్వేషాలు రెచ్చగొడుతుందన్నారు.
రాముడి పేరుతో రాజకీయం చేయడం దుర్మార్గమన్నారు.ప్రజల విశ్వాసాలను సొమ్ము చేసుకోవడం సరికాదన్నారు.
బీసీ కులగణన చేపట్టకుండా సుప్రీంకోర్టు వెళ్లిన చరిత్ర బిజెపి ది అన్నారు మహిళలపై బీజేపీ హాయంలో 250రేట్లు హింస పెరిగిందన్నారు .కేరళ తమిళనాడు వంటి రాష్ట్రాల్లో గవర్నర్లను పెట్టి అణిచివేస్తుందన్నారు.పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ని ఓడించకపోతే ప్రజాస్వామ్యం రాజ్యాంగం రక్షించుకోలేమన్నారు.సెక్యులర్ శక్తులు దేశభక్తులు ఐక్యం కావాలని బీజేపీ ఓటమి ద్వారా ప్రజల హక్కులు రక్షించుకోవాలన్నారు.
ప్రజా ఉద్యమాలే పాలకుల మెడలు వంచి హక్కులు కాపాడిన గత చరిత్ర అంత రుజువు చేస్తుందన్నారు.కాంగ్రేస్ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలన్నారు.
అనంతరం సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి స్కైలాబ్ బాబు మాట్లాడుతూ ప్రజాపాలన ఒక కోటి 24లక్షల దరఖాస్తులు వచ్చాయని, ఎన్నికల్లో కాంగ్రేస్ ఇచ్చిన వాగ్దానాలన్నింటిని చిత్తశుద్ధితో అమలు చేయాలన్నారు.పేదలకు గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పిన వాగ్దానం అమలుచేయలేదన్నారు.
కాంగ్రేస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్నారు.పేదల వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం 5లక్షల రూ లు ఇవ్వాలన్నారు.
గత ప్రభుత్వం పేదలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయలన్నారు.కమ్యూనిస్టులు బలహీనపడ్డారని బాగా ప్రచారం జరుగుతోందని కానీ కమ్యూనిస్టులను ఓట్లు సీట్ల లో మాత్రమే చూడలేమని పేదల హక్కుల కోసం అది నిర్వహిస్తున్న ప్రజాఉద్యమాలలో చూడాలన్నారు.
ప్లీనం ప్రారంభం కంటే ముందు అమరవీరుల కు 2నిమిషాలు మౌనం పాటించి సంతాపం ప్రకటించారు.ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి ,జవ్వాజి విమల , మళ్లారపు అరుణ్ కుమార్ (ఎంపిటిసి),ఎరవెళ్లి నాగరాజు (ఉపసర్పంచ్) కోడం రమణ , ముక్తికాంత అశోక్, సూరం పద్మ ,గురిజాల శ్రీధర్ , మాల్లారపు ప్రశాంత్ వివిధ ప్రజాసంఘాల నాయకులు శాఖా కార్యదర్శులు పాల్గొన్నారు.