బీజేపీ పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి వరుసగా రెండో సారి కూడా అధికారాన్ని చేజిక్కుంచుకున్న విషయం తెలిసిందే.అయితే ఈ విజయానికి దిష్టి తగిలిన చందనా ఆ పార్టీ కి చెందిన పలువురు నేతలు వరుసగా అనారోగ్యం పాలవుతుండడం ఆ పార్టీ ని ఆందోళనకు గురిచేస్తుంది.
మొన్నటికి మొన్న ఆ పార్టీ సీనియర్ నేత,మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ హఠాన్మరణం ఆ పార్టీ కి తీరని లోటు గా చెప్పాలి.అయితే సుష్మా మరణం నుంచి ఇంకా కోలుకొని బీజేపీ కి ఆ పార్టీ మరో సీనియర్ నేత,మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కూడా అనారోగ్యం తో కన్నుమూయడం మరింత కలచివేసింది.
అయితే అరుణ్ జైట్లీ అంత్యక్రియలు ఇంకా ముగియకుండానే ఆ పార్టీ మరో సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి ఆసుపత్రి పాలైనట్లు తెలుస్తుంది.ఇప్పటికే ఇద్దరు మాజీ కేంద్ర మంత్రులను పోగొట్టుకున్న బీజేపీ పార్టీ కి మరో సీనియర్ నేత అనారోగ్యం తో ఆసుపత్రి పాలవ్వడం ఆ పార్టీ వర్గాల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది.
కాన్పూర్ లోని ఆయన నివాసం లో ఆదివారం అస్వస్థతకు గురికావడం తో హుటాహుటిన ఆయనను కాన్పూర్ లోని రీజెన్సీ ఆసుపత్రి కి తరలించినట్లు తెలుస్తుంది.ప్రస్తుతం ఆయనకు అక్కడ ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది,కండీషన్ ఏంటి అన్న వివరాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు.ఈ ఘటనకు సంబందించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.