పాఠాలు నేర్పించే గురువు ఒక్కొక్కరు ఒక్కో పద్దతి పాటిస్తూ పిల్లలకు చెబుతూ ఉంటారు.ఒకరు కొట్టి చెబుతారు మరొకరు నవ్వుతూ చెబుతారు.
ఎవరు ఎలా చెప్పినా పిల్లలు ఎలా అర్ధం చేసుకుంటారు అన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది.అయితే ఒడిశా లో మాత్రం ఒక గురువు గారు పిల్లలకు వినూత్నంగా పాఠాలు చెబుతున్నారు.
ఇంతకీ ఆయన ఎలా పాఠాలు చెబుతున్నారు అని అనుకుంటున్నారా.డ్యాన్స్ చేస్తూ సార్ గారు పాఠాలు నేర్పుతున్నారు విద్యార్థిని,విద్యార్థులకు.
ఆయన డాన్స్ చేస్తూ హుషారు గా పాఠాలు చెబుతుంటే ఆయనను అనుకరిస్తూ విద్యార్థులు కూడా అంతే హుషారుగా పాఠాలు నేర్చుకుంటున్నారు.అయితే ఇదేదో చిన్న పిల్లల కు మాత్రమే అనుకుంటే పొరపాటే పెద్ద పిల్లలకు సైతం ఇలానే పాఠాలు నేర్పుతున్నారు గురువుగారు.
ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.టీచర్ స్టెప్స్ వేస్తూ పాఠాలు నేర్పుతుంటే విద్యార్థులు నవ్వుకుంటూ ఆ పాఠాలను నేర్చుకుంటుండడం విశేషం.

నిజంగా ఒడిశా లోని కోరాపుట్ జిల్లా లోని ఒక పాఠశాల లో ఈ ఘటన చోటుచేసుకుంది.అక్కడ టీచర్ గా పనిచేస్తున్న ఆయన డ్యాన్స్ చేస్తూ పిల్లలకు పాఠాలు చెబుతుండడం అందర్నీ ఆకట్టుకుంటుంది.ప్రస్తుతం ఈ వీడియో పాఠాలు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారాయి.







