బీజేపీ నేతలకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు.. మంత్రి నిరంజన్‌రెడ్డి

సమస్యలు లేని దగ్గర బీజేపీ నేతలు సమస్యలు సృష్టిస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.‘నిజానికి తెలంగాణలో రైతులకు ఎలాంటి సమస్య లేదు.కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి.

 Bjp Leaders Dont Deserve To Talk About Farmers Says Minister Niranjan Reddy, Bjp-TeluguStop.com

బీజేపీ నేతలు యాసంగి పంట కొంటారా లేదా అనేదానికి సమాధనం చెప్పకుండా ఇప్పుడు ఇంకో కొత్తరకం ఆందోళన చేస్తున్నారు.దేశంలో రైతుల ధర్నాను పట్టించుకోకుండా ఇక్కడ రైతుల కోసం ప్రేమ చూపిస్తున్నారు.

రైతు ధాన్యాన్ని ప్రతిగింజ కాపాడుకుంటాడు.బీజేపీ నేతలు అక్కడకు వెళ్లి ధాన్యాన్ని ఆగం చేస్తున్నారు.బీజేపీ నేతలకు సిగ్గుండాలి.రైతులు పండించే పంటలో మీ పార్టీ పాత్ర ఏంటి?.బీజేపీ నేతలకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు.రైతులకు బీజేపీ ఉరితాడు వేస్తోంది.దేశంలో ఎలగబెట్టేది లేక రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారు.మీ పార్టీ బిజినెస్‌ పార్టీ, కార్పొరేట్‌ పార్టీ.

రైతుల కోసం ఇన్నేళ్లలో బీజేపీ చేసిందేమిటి?’ అంటూ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube