పవన్ కు ప్రత్యేక మర్యాద ఇస్తున్న బిజెపి?

నిజానికి రాజకీయ వ్యూహాలను అమలు చేయడంలో తలపండిన బిజెపికి( BJP ) ఎంతోమంది అగ్ర స్తాయి రాజకీయ నేతలను డీల్ చేసిన అనుభవం ఉంది.మరాఠా యోదుడు శరత్ పవార్ దగ్గర నుంచి బీహార్ రాజకీయ చాణక్యుడు నితీష్ కుమార్ వరకూ ఎంతో మంది ఉద్దండులను తమదైన శైలిలో డీల్ చేసిన బిజెపి ఒక్క ఎమ్మెల్యే కూడా లేని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి( Pawan Kalyan ) మాత్రం ప్రత్యేక మర్యాదనిస్తుందా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవునననే అనిపిస్తుంది.

 Bjp Giving Special Treatment To Pawan Kalyan Janasena Party Details, Bjp , Pawan-TeluguStop.com

ముఖ్యంగా ఒకపక్క ఎన్డీఏలో( NDA ) భాగస్వామిని అని చెబుతూనే మరోపక్క తెలుగుదేశంతో పొత్తును ఏకపక్షంగా ప్రకటించిన జనసేన మీద సాదరణం గా అయితే బిజేపి కి పీకల వరకూ కోపం ఉండాలి.కానీ బిజేపి అధిష్టానం మాత్రం పవన్ కు రెడ్ కార్పెట్ పరుస్తుంది.

Telugu Amit Shah, Chandrababu, Janasena, Janasenabjp, Narendra Modi, Pawan Kalya

తెలంగాణ ఎన్నికలపై పొత్తు గురుంచి చర్చించడానికి ఆహ్వానం పంపించడం, ఆంధ్రా ముద్ర పడుతుందని తెలిసినా కూడా జనసేనతో( Janasena ) పొత్తుకు సిద్ధమవుటం చూస్తుంటే పవన్ ను ప్రాంతాలకతీతం గా బిజెపి గుర్తించి గౌరవిస్తుందా అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.అయితే పవన్ కి దక్కుతున్న ప్రత్యేక మర్యాద వెనక జనసేన ఒకప్పుడు బిజేపి పట్ల చూపించిన నిజాయితీనే కారణమని విశ్లేషణలు వస్తున్నాయి.2014లోనే పార్టీ స్తాపించి పోటీ చెయ్యాలనుకున్నా దేశానికి నరేంద్ర మోడీ( Narendra Modi ) లాంటి నాయకత్వం అవసరమని నిస్వార్ధంగా పోటీ చేయకుండా షరతులు లేని మద్దతు ఇచ్చిన పవన్ పై ఉన్న ప్రత్యేకమైన అభిమానంతోనే జనసేన వేస్తున్న రాజకీయ తప్పటడుగులను సైతం బిజెపి పెద్దమనసు తో క్షమిస్తున్నట్టుగా కనిపిస్తుంది.

Telugu Amit Shah, Chandrababu, Janasena, Janasenabjp, Narendra Modi, Pawan Kalya

నిజానికి ఒకసారి పొత్తు చర్చలు పూర్తయిన తర్వాత ఏ రకమైన అవిధేయతను బిజెపి సహించదు.కానీ పవన్ కళ్యాణ్ టిడిపి తో( TDP ) పొత్తు పై స్వతంత్రంగా నిర్ణయం తీసుకొని వాటిని మీడియా ముఖం గా ప్రకటించినా కూడా పవన్ కు ఈ స్థాయి గౌరవం బజాపా నుంచి దక్కుతుందంటే పవన్ కళ్యాణ్ ను ఒక ప్రత్యేక నాయకుడిగా బిజెపి గౌరవించడమే కారణమంటూ జనసేన శ్రేణులు చెప్పుకొస్తున్నాయి.ఏది ఏమైనా రాజకీయం గా మాత్రం జనసేన కి ఇప్పుడు మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి .వాటిని ఆ పార్టీ ఏ విదం గా ఉపయోగించుకుంటుదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube