తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ షో( Bigg Boss Show ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇప్పటికే తెలుగులో ఏడు సీజన్లను విజయవంతంగా ర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఎనిమిదవ సీజన్ సక్సెస్ఫుల్గా ప్రదర్శితం అవుతోంది.
కాగా బిగ్ బాస్ టెలివిజన్ రంగంలో ఒక సంచలనం అని చెప్పాలి.ఇక ఎప్పటిలాగే ఈసారి సరికొత్తగా అన్లిమిటెడ్ అంటూ ప్రేక్షకులకు ముందుకు వచ్చిన బిగ్ బాస్ షో గొడవలు, కొట్లాటలు అరుపులతో రసవత్తరంగా సాగుతోంది.
బిగ్ బాస్ ఈ సీజన్లో ఎవరు ఉహించని విధంగా ట్విస్ట్ లు, గేమ్స్ తో ముందుకి వెళ్తోంది.

గత సీజన్లో ఎక్కువ మంది కంటెస్టెంట్స్ తో షోని మొదలు పెట్టారు.ఆ తర్వాత అయిదు, ఆరవ వారంలో ఒకరు లేదా ఇద్దరు కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డ్ ద్వారా లోపలికి పంపారు.కానీ ఈసారి పద్నాలుగు మందితో షోని మొదలు పెట్టారు.
అందులో ఒకరు ఎలిమినేట్ అవ్వగా ప్రస్తుతం హౌస్ లో పదమూడు మంది మాత్రమే ఉన్నారు.ఇక రేపు మరొక కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నారు.
ఇకపోతే ఈసారి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చేది గత సీజన్ కంటెస్టెంట్స్ అని టాక్ గట్టిగానే వినిపిస్తోంది.ఇది ఆల్రెడీ హిందీ , తమిళ్ బిగ్ బాస్ షో లో ఇలా తీసుకోవడం సాధారణంమే కానీ తెలుగు బిగ్ బాస్ లో ఇంత వరకు అలా చెయ్యలేదు కానీ ఈసారి కచ్చితంగా మాజీ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఉంటుందట.

అందులో ఇప్పటికే సీజన్ 4 కంటెస్టెంట్ అయిన ముక్కు అవినాష్ ని బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయిందట ముక్కు అవినాష్ ఆ సీజన్ లో కూడ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంటే.అంతేకాకుండా సీజన్ 3 కంటెస్టెంట్ రౌడీ రోహిణి( Rohini Reddy ) ఇంకా గత సీజన్ లో మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిన నయని పావని వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.బయట నుండి లోపలున్న వారి గేమ్ చూసి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే వారి గేమ్ స్ట్రాటజీ డిఫరెంట్ గా ఉంటుంది.హౌస్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ అనేది మూడవ వారంలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరి ఈసారి వైల్డ్ కార్డు ద్వారా ఎవరు ఎంట్రీ ఇస్తారు అన్నది తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే మరి.