బిగ్ బాస్( Bigg Boss ) చరిత్రలోనే అతి కష్టమైన జర్నీ ఎవరిదైనా ఉందా అంటే అది అమర్ దీప్( Amardeep ) జర్నీ అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.మొదటి 5 వారాల్లో అమర్ పై జరిగినంత నెగటివిటీ ఏ కంటెస్టెంట్ మీద కూడా జరగలేదు.
అతనితో కలిసి పని చేసిన వాళ్ళు కూడా అమర్ ఆటని చూసి నవ్వుకున్నారు.వరుసగా 5 వారల పాటు నాగార్జున చేత తిట్టించుకున్న ఏకైక కంటెస్టెంట్ కూడా అమర్ మాత్రమే.
అంత నెగటివిటీ జరిగితే ఏ కంటెస్టెంట్ అయినా నాలుగు వారాలకు మించి హౌస్ లో ఉండలేరు.కానీ అమర్ దీప్ మాత్రం ఇంత కఠినతరమైన పరిస్థితి నుండి పైకి లేచి పట్టువదలని విక్రమార్కుడు లాగా, ప్రతీ టాస్కులో తన నుండి వంద శాతం ఇవ్వడానికి ప్రయత్నం చేసాడు.
ప్రారంభం లో ఫౌల్ గేమ్ ఆడాడు అని సీజన్ మొత్తం ఫౌల్ గేమ్ ఆడినట్టు అమర్ ని చాలా చెడ్డగా సోషల్ మీడియా లో ప్రాజెక్ట్ చేసారు.

చివరికి హోస్ట్ నాగార్జున( Nagarjuna ) దగ్గర నుండి హౌస్ లో అమర్ స్నేహితులుగా చెప్పుకున్న ప్రియాంక మరియు శోభా శెట్టి వరకు అమర్ ఆడే ఆటలు మొత్తం దొంగాటాలుగా చెప్పుకొచ్చారు.ఇంత తక్కువ చెయ్యాలని చూసినా అమర్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.తాను హౌస్ లో ఎలా అయితే ఉండాలని అనుకున్నాడో అలాగే ఉన్నాడు.
ఆడియన్స్ కి తిరుగులేని ఎంటర్టైన్మెంట్ అందించి బిగ్ బాస్ సీజన్ 7( Bigg Boss 7 ) రన్నర్ గా నిలిచాడు.అమర్ హౌస్ ఎదురుకున్న మానసిక సంఘర్షణకి ఆయన టైటిల్ కొడితే బాగుండును అని ఆయన అభిమానులు కోరుకున్నారు.
కానీ 14 వ వారం అమర్ ప్రశాంత్ తో గొడవ పడడం, అతని పట్ల ఆవేశం తో ప్రవర్తించిన తీరు కారణంగా అమర్ గ్రాఫ్ కాస్త క్రిందకు దిగింది.ఈ ఒక్క సాకుని పట్టుకొని అమర్ ని టాప్ 5 లో లేకుండా చెయ్యాలని కొన్ని పీఆర్ టీమ్స్ బాగా కష్టపడ్డాయి కానీ, టైటిల్ అవార్డు కి అడుగు దూరం వరకు అమర్ ని ఆపగలిగారు.

ఇదంతా పక్కన పెడితే అమర్ దీప్ పాపులర్ టీవీ సీరియల్ హీరో కాబట్టి ఆయనకీ రెమ్యూనరేషన్ కూడా అదే రేంజ్ లో ఇచ్చారని టాక్.15 వారాలకు గాను అమర్ దీప్ కి దాదాపుగా 68 లక్షల రూపాయిలు బిగ్ బాస్ టీం ఇచ్చినట్టు చెప్తున్నారు.టైటిల్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) గెలుచుకున్న మొత్తం నగదు విలువ 60 లక్షల వరకు ఉంటుంది.కానీ అమర్ దీప్ కి 68 లక్షలు అనడం తో ఆయన అభిమానులు కాస్త సంతృప్తి చెందారు.