నామినేషన్స్ లో అరియానాపై అఖిల్ ఫైర్.. ఉమెన్ గెలవాలని ఎలా అంటావ్?

తాజాగా బిగ్ బాస్ హౌస్ లో జరిగిన చివరి నామినేషన్స్ లో భాగంగా అషు రెడ్డి విషయంలో హోస్ట్ నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లకు వీడియో చూపించగా అందరు కూడా యాంకర్ శివదే తప్పు అఇ చెప్పడంతో హోస్ట్ నాగార్జున శివ కి గట్టిగా వార్నింగ్ ఇవ్వడమే కాకుండా అషు కి క్షమాపణలు కూడా చెప్పించాడు.నిజానికి యాంకర్ శివ కు నిజంగానే కాస్త నోటిదూల బాగా ఎక్కువ.

 Bigg Boss Non Stop Telugu Day 64 Nominations Promo Akhil Heated Argument With Ar-TeluguStop.com

ఎంటర్టైన్మెంట్ పేరుతో అతన్ని ఎంకరేజ్ ఎలిమినేట్ చేస్తూ కాపాడుతూ వస్తున్న నాగార్జున అండ్ బిగ్ బాస్ టీం.అషురెడ్డి విషయానికి వచ్చేసరికి మాత్రం.చివరికి శివని టార్గెట్ చేశారు.

ఈవారం కూడా అరియానా శివని నామినేట్ చేసింది.

అషురెడ్డి గురించి చూపించిన వీడియో కారణంగా శివ ని నామినేట్ చేసింది అరియానా.ఈవారం నామినేషన్స్‌కి సంబంధించిన ప్రోమో విడుదల కాగా.

ఇందులో అఖిల్, అరియానాల మధ్య ఆసక్తికర డిస్కషన్ నడించింది.అరియానా కూడా ఈసారి ఉమెన్ బిగ్ బాస్ విన్నర్ కావాలని చెప్పడంతో అఖిల్‌కి కోపం వచ్చేసింది.

ఈసారి తాను విన్నర్ అయిపోవడం ఖాయం అని భ్రమల్లో ఉన్న అఖిల్.ఈ నామినేషన్స్‌లో అరియానా ప్రస్తావించిన ఉమెన్ కార్డ్ ఇష్యూని తెరపైకి తెచ్చాడు.

అమ్మాయి గెలవాలని కోరుకుంటున్నా అని అన్నావ్.అమ్మాయి గెలవాలని అనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగానే గేమ్ ఎందుకు ఆడలేదు అని ప్రశ్నించాడు అఖిల్.అప్పడు అరియానా.జన్యున్‌గా బయట టాక్ లేదా? ఒక ఫీమేల్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కావాలిన నాకు ఉంది బిగ్ బాస్ అని చెప్పింది.అది రాంగ్ అని అఖిల్ అనడంతో.నేను గెలిచినా గెలవకపోయినా.

ఒక స్ట్రాంగ్ ఉమెన్ బిగ్ బాస్ టైటిల్ గెలివాలి అంటూ గట్టిగా అరిచిచెప్పింది అరియానా.దీంతో అఖిల్.

ఎవరు బాగా ఆడితే వాళ్లే విన్ అవుతారు అంటూ పిడికిలి బిగించి మరీ చెప్పాడు.మొత్తానికి అరియానా మాటలకు అఖిల్ కు బాగానే కోపం వచ్చినట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube