ఇంత త్వరగా బయటకు పంపుతారు అనుకోలేదు.. అభినయశ్రీ లబోదిబో!

తాజాగా బిగ్ బాస్ హౌస్ లో సండే సందడి సందడిగా సాగింది.నాగార్జున కూడా హౌస్ మేట్స్ చాలా సరదాగా గడిపాడు.

 Bigg Boss 6 Telugu Abhinaya Sri Eliminate Bigg Boss 6 Telugu Bigg Boss Reality-TeluguStop.com

అంతేకాకుండా మరింత ఎంటర్టైన్మెంట్ ను అందించడానికి మిల్క్ బ్యూటీ తమన్నా కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.అంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఇక తప్పకుండా ఎవరో ఒకరు ఎలిమిట్ కావాల్సిందే కాబట్టి చివర్లో ఒకరిని ఎలిమినేట్ చేసి అందర్నీ ఏడిపించేసాడు హోస్ట్ నాగార్జున.

ఇక తమన్నా హౌస్ లోకి వెళుతున్నప్పుడు ఆమె చేతితో ఒక కానుక ఇచ్చి పంపాడు నాగార్జున.

ఇక తమన్నా లోపలికి వెళ్లిన తర్వాత ఆ గిఫ్ట్ కేవలం మగవారి కోసమే అని అనడంతో అప్పుడు లేడీ కంటెస్టెంట్లు అన్యాయం సర్ లాస్ట్ వీక్ కూడా మగవాళ్ళే గెలిచారు అని అనగా వెంటనే నాగార్జున కాసేపు అయ్యాక చెప్తాను అంటూ లేడీ కంటెస్టెంట్లను,జెంట్స్ కంటెస్టెంట్లను వేరు వేరు టీములుగా కూర్చో పెడతాడు.

ఆ తర్వాత బాయ్స్ అందరూ లేడీ కంటెస్టెంట్లలో ఎవరు బౌన్సర్ కావాలి అనుకుంటున్నారు చెప్పి వారి చేతికి బ్యాండ్ కట్టాలి అని చెబుతారు నాగార్జున.అలా ఒక్కొక్కరుగా వచ్చి బ్యాండ్ కడతారు.

Telugu Abhinaya Sri, Biggboss, Eliminate, Tamanna-Movie

ఇక అందరిలో కంటే ఎక్కువగా బ్యాన్స్ గీతూ దక్కించుకోవడంతో గీతూనే లేడి బౌన్సర్ గా ప్రకటించారు నాగార్జున.ఆ తర్వాత తమన్నా చేతిలో ఉన్న గిఫ్ట్ సూర్యకి కానుకగా అందించింది తమన్నా.వెంటనే నాగార్జున గీత అయినట్టుగా ప్రకటించాడు.ఆ తరువాత ఇంటి సభ్యులను రెండు టీములుగా విభజించి ఒక టాస్క్ ఇచ్చాడు.ఇక ఆ టాస్క్ లో చివరగా ఆదిరెడ్డి అభినయశ్రీ మిగిలారు.వారిలో అభినయశ్రీ హెల్మెట్ అయినట్టు నాగార్జున ప్రకటించేశాడు.

బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చిన అభినయ ఇంత త్వరగా ఆడియన్స్ నన్ను బయటకు పంపిస్తారు అనుకోలేదు అంటూ ఎమోషనల్ అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube