తెలుగులో మంచి పాపులారిటీ పొందిన “బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో” మూడో సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొని విజేతగా నిలిచిన ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే అంతకు ముందు రాహుల్ సిప్లిగంజ్ తన పాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నప్పటికీ బిగ్ బాస్ సీజన్ తర్వాత రాహుల్ సిప్లిగంజ్ కి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి.
అంతేగాక పలు సినిమాలలో పాటలు పాడే అవకాశాలతో పాటూ నటించే అవకాశాలను కూడా దక్కించుకున్నాడు. ప్రస్తుతం అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఇంటి పట్టునే ఉంటున్నాడు.
ఈ క్రమంలో సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అందుబాటులో ఉంటున్నాడు.
ఈ క్రమంలో తాజాగా తాను సెలబ్రిటీస్ తో తాను దిగినటువంటి ఫోటోలను తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకున్నాడు.
అయితే ఇందులో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో దిగినటువంటి ఫోటో ని షేర్ చేశాడు.దీంతో కొందరు బన్నీ అభిమానులు చిన్నప్పుడు రాహుల్ సిప్లిగంజ్ ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడని అంటూ ఫన్నీ గా కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రాహుల్ సిప్లిగంజ్ టాలీవుడ్ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నాడు.అంతేగాక పలు టాలీవుడ్ చిత్రాలకి తన పాటలను అందిస్తున్నాడు.