తెలుగు బిగ్‌బాస్ సీజన్ 2 ఇంతగా పబ్లిసిటీ తెచ్చుకోవడానికి ప్రధాన కారణం కౌశల్ ఆర్మీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఈసారి సీజన్ సక్సెస్‌కు సగం క్రెడిట్ కౌశల్ ఆర్మీకి దక్కుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఒక సాదారణ సెలబ్రెటీగా ఇంట్లోకి ప్రవేశించిన కౌశల్ ప్రస్తుతం స్టార్ అయ్యాడు.ఆయన ఆట తీరు మరియు అతడి పద్దతి అన్ని కలిపి ఆయనకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను దక్కేలా చేశాయి.
కౌశల్ అన్ని విధాలుగా అభిమానులను అలరిస్తూ బిగ్‌బాస్ హౌస్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు.అందుకే కౌశల్ ఆర్మీ సోషల్ మీడియాలో రోజు రోజుకు పెరిగి పోతూనే ఉంది.

సీజన్ ప్రారంభం అయిన మూడవ వారం నుండి కౌశల్ ఆర్మీ ఏది అనుకుంటే అదే జరిగి పోతుంది.కౌశల్‌పై పల్లెత్తు మాట అన్నా కూడా తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ చేస్తున్నారు.దాంతో నాని అసలు కౌశల్‌ను టార్గెట్ చేయడమే మానేశాడు.ఆమద్య కౌశల్‌పై నాని ఆగ్రహం చేయడంతో బిగ్‌బాస్‌కు నాని అనర్హుడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసి పరువు తీశారు.
అందుకే నాని ఎలాంటి వివాదాస్పదం కాకుండా కౌశల్‌ను స్కిప్ చేసేస్తున్నాడు.
తాజాగా కౌశల్ సీజన్ మొత్తంకు నామినేట్ అయిన విషయం తెల్సిందే.
ఇదే సమయంలో కౌశల్ స్కోప్ తగ్గించే ప్రయత్నాలు బిగ్‌బాస్ నిర్వహకులు చేస్తున్నారు.ప్రస్తుతం కౌశల్‌కు భారీ ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
అందుకే ఇకపై కౌశల్‌ను బిగ్‌బాస్ స్క్రీన్‌పై ఎక్కువ చూపించకుండా, అతడి క్రేజ్ తగ్గించేలా బిగ్‌బాస్ టీం ప్రయత్నాలు చేస్తోంది.కౌశల్‌పై నెగటివ్ ఫీలింగ్ కలిగేలా మాత్రమే ఇకపై ఫీడ్‌ను ప్రసారం చేయాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం అందుతుంది.

బిగ్‌బాస్ ఫైనల్ వరకు ఇలాగే పరిస్థితి కొనసాగితే విజేత కౌశల్ అంటూ అందరు ఒక నిర్ణయానికి వచ్చి షోపై ఆసక్తి తగ్గించుకుంటారు.అందుకే కౌశల్‌ను బ్యాడ్ చేయడం వల్ల షోపై ఆసక్తి కలిగించాలని నిర్వాహకులు భావిస్తున్నారు.వారి ప్రయత్నాలు ఎంత మేరకు సఫలం అవుతాయో చూడాలి.