మన దేశంలో చాలా మంది ఇప్పటికి కూడా ఆడపిల్ల పుడితే మొహం మాడ్చేస్తారు.జెనెరేషన్ మారుతున్నా కూడా ఇప్పటికి అలాగే కొంతంనుండి ఆడపిల్లను బరువు గానే చూస్తున్నారు.
ఆడపిల్ల అని తెలిసి అభాషన్ చేయించే వారు ఇప్పటికీ మన సమాజంలో ఉన్నారు.కానీ ఈ తండ్రి మాత్రం ఆడపిల్ల పుట్టిందని సంతోషంతో గాలిలో తేలిపోతున్నాడు.
ఆడపిల్ల అయినా మెగా పిల్లడు ఆంయినా అందరు సమానమే అని అతడు నిరూపించాడు.
ఆ సంతోషంలోనే తన కూతురు పుట్టిన సందర్భంగా గ్రాండ్ పార్టీ ఇవ్వాలని అనుకున్నాడు.
అనుకున్న విధంగానే అతడు సెలెబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా చేసాడు.కానీ మీరు గ్రాండ్ అంటే ఫైవ్ స్టార్ హోటల్ లో విందు ఏర్పాటు చేసి చేసారు అనుకుంటున్నారా.
కాదు ఇది చాలా వెరైటీ సెలెబ్రేషన్స్ అనే చెప్పాలి.తన కూతురు పుట్టిన ఆనందంలో తనకు తోచినంతలో అందరికి పార్టీ ఇచ్చాడు ఆ తండ్రి.
ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని కోలార్ ప్రాంతంలో జరిగింది.అతడు గత ఇరవై సంవత్సరాలుగా పానీపూరి బండిని నడుపుతున్నాడు.

అతడికి అదే జీవినాధారం.అయితే అతడికి ఈ మధ్య కూతురు పుట్టింది.దీంతో అతడు తన ఇంటికి మహాలక్ష్మి వచ్చింది అని మురిసి పోయాడు.ఆ సంతోషంలో తనకు తోచిన కాడికి సెలెబ్రేషన్స్ చేసాడు.
ఇంతకీ ఆ సెలెబ్రేషన్స్ ఏంటో తెలుసా.
అతడు నడిపే పానీపూరి బండిలోనే అందరికి ఉచితంగా పంచాలని అనుకున్నాడు.
దీంతో మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు ఎంత మంది వచ్చినా అందరికి ఫ్రీగా పానీపూరి పెట్టాడు.ఇలా ఎంత ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా.50 వేల రూపాయల పానీపూరీని ఉచితంగా తన కూతురు పుట్టిన సంతోషంలో పెట్టాడు.

అంతేకాదు పానీపూరీ తో పాటు అందరికి ఒక మెసెజ్ కూడా ఇచ్చాడు.ఆడపిల్ల రేపటి భవిష్యత్తుకు చాలా అవసరం అని మెసేజ్ ఇచ్చాడు.
దీంతో అక్కడి ప్రజలందరూ పానీపూరీ కోసం ఎగబడ్డారు.
అందరు పానీపూరి తిని ఆ చంటి బిడ్డను ఆశీర్వదించి వెళ్లిపోయారు.ఆడపిల్ల పుట్టిందని భారంగా భావించే ఎంతో మంది తల్లిదండ్రులకు ఈ తండ్రి ఆదర్శంగా నిలిచాడు.