బెల్లంకొండ శ్రీనివాస్ దశ తిరిగినట్టేనా.. అందుకు ఇదే సాక్ష్యం

బెల్లంకొండ శ్రీనివాస్( Bellamkonda Srinivas )… బెల్లంకొండ సురేష్ కొడుకుగా తొలుత సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన, లుక్స్ పరంగా కూడా కాస్త అట్రాక్టివ్ గానే ఉన్నప్పటికీ సినిమాల ఎంపికలో మిస్టేక్స్ చేయడంతో ఇప్పటివరకు సరైన సక్సెస్ ని సాధించలేకపోతున్నాడు.కానీ ఒక నిర్మాత ఇంట పుట్టాడు కాబట్టి గోల్డెన్ స్పూన్ తో జీవితాన్ని లీడ్ చేస్తూ తనకు నచ్చిన విధంగా పెట్టుబడును పెడుతూ సినిమాలు తీసుకుంటూ వస్తున్నాడు.

 Bellamkonda Srinivas Back To Back Movies In Hindi Details, Bellamkonda Srinivas,-TeluguStop.com

సినిమా తనకు రివర్స్లో ఎంత ఇచ్చింది అనే విషయం కన్నా కూడా సినిమాలు తీయడమే ముఖ్యం అన్నట్టుగా శ్రీనివాస్ సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు.టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో శ్రీనివాస్ పై అనేక ట్రోల్స్ కూడా ఉన్నాయి.

అలాగే తెలుగులో రాక్షసుడు సినిమా( Rakshasudu movie ) మినహా ఒక్క సరైన హిట్టు కూడా లేదు.

-Movie

కానీ అతడు తీసే సినిమాలో ఎన్ని కోట్లు ఖర్చైనా సరే పెద్ద హీరోయిన్స్ మాత్రమే ఉండాలని భావిస్తాడు.అందుకే పూజ హెగ్డే, సమంత, రకుల్, కాజల్ లాంటి హీరోయిన్స్ అతడే సరసన హీరోయిన్స్ గా నటించారు.ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ దశ తిరిగినట్టుగా తెలుస్తోంది.

ఎందుకంటే చత్రపతి( chatrapati ) సినిమాను హిందీలో రీమేక్ చేయడం అనే ఒక విషయం బయటకు రాగానే ఇక శ్రీనివాస్ అదృష్టం హిందీ చిత్ర పరిశ్రమలో తేల్చుకోబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తీసిన చత్రపతి సినిమా ఎంత పెద్ద ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే.

-Movie

ఇలాంటి ఒక సినిమా హిందీలో తీసిన కథా బలంతో సినిమా హిట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో గట్టి ముద్ర వేస్తాడని అందరూ అప్పుడే భావించారు.నిర్మాత గదా సైతం బెల్లంకొండ శ్రీనివాస్ కి 60 కోట్ల రూపాయలను చత్రపతి సినిమా కోసం వెచ్చించడానికి సిద్ధమయ్యాడు.అంతే కాదు ఈ సినిమా నిర్మాణం పూర్తి కాగానే మరొక మూడు సినిమాలకు సైతం సదరు నిర్మాత సంతకం చేయించుకున్నట్టుగా తెలుస్తోంది.దీన్ని బట్టి చూస్తే మరి కొన్నాళ్లపాటు బాలీవుడ్ లో బెల్లంకొండ శ్రీనివాస్ తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంది అలాగే స్టార్ హీరో అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube