కోలీవుడ్ లో ఉన్న అతి కొద్ది మంది డైరెక్టర్లలో వెత్రి మారన్( Vetri Maran ) ఒకరు ఆయన తీసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అవుతుంది.ముఖ్యం గా ధనుష్ తో తీసిన అసురన్ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయింది.
ఈ సినిమాని వెంకటేష్ నారప్ప అనే టైటిల్ తో రీమేక్ చేశాడు…ఇక్కడ కూడా ఆ సినిమా బాగా ఆడింది.

ఇక వేత్రి మారన్ దర్శకత్వం లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, సూరి( Vijay Sethupathi, Suri ) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ విడుదల పార్ట్ 1( Vidudala part 1 ).తెలుగు లో విడుదల టైటిల్ తో అలానే తమిళ్ లో విడుతలై టైటిల్ తో రిలీజ్ అయింది.థ్రిల్లింగ్ అంశాలతో నాచురల్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఇటీవల తమిళ్, తెలుగు భాషల్లో థియేటర్స్ లో రిలీజ్ అయి మంచి సక్సెస్ సొంతం చేసుకుంది.

ఆ తరువాత ఈ మూవీ అన్ కట్ ఫుల్ వెర్షన్ ని ప్రముఖ ఓటిటి మాధ్యమం జీ 5 ఓటిటి( Z5 ) మాధ్యమంలో ఆడియన్స్ ముందుకి వచ్చింది.ఇక ఈ మూవీ తమిళ్ వర్షన్ ప్రస్తుతం జీ 5 లో భారీ స్థాయి వ్యూస్ తో ఒక సెన్సేషనల్ రికార్డు నెలకొల్పింది.కాగా విడుదల పార్ట్ 1 మూవీ వేగంగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సొంతం చేసుకున్న మూవీగా రికార్డు అందుకుందని జీ 5 తమిళ్( Z5 tamil ) వారు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు.కాగా తమ సినిమా అందరినీ ఆకట్టుకుంటూ ఉండడంతో విడుదల మూవీ మేకర్స్ ఆనందం వ్యక్తం చేసారు.
ఇక విడుదలై పార్ట్ 2 త్వరలో ఆడియన్స్ ముందుకి రానుంది…ఇక ఈ సినిమా మీద కూడా జనాల్లో మంచి అంచనాలే ఉన్నాయి.ఇక ఈ సినిమా కోసం జనాల చాలా బాగా వెయిట్ చేస్తున్నారు…
.







