భారత జట్టుకు కొత్త కోచ్ కోసం అన్వేషిస్తున్న బీసీసీఐ.. కొత్త కోచ్ ఎవరంటే..?

భారత జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్( Rahul Dravid ) పదవీకాలం ముగిసిన సంగతి తెలిసిందే.ఇక రాహుల్ ద్రావిడ్ పదవీకాలం పొడగించాలా లేదంటే కొత్త కోచ్ ను నియమించుకోవాలా అనే విషయనికి వస్తే.

 Bcci Is Looking For A New Coach For The Indian Team.. Who Is The New Coach..?, B-TeluguStop.com

బీసీసీఐ కొత్త కోచ్ ను నియమించుకోవడానికే అధిక ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ విషయంపై బీసీసీఐ అధికారి ఒకరు ఏమన్నారంటే.టీ20 ప్రపంచ కప్( T20 World Cup ) కు దాదాపుగా ఏడు నెలలకు పైగా సమయం ఉంది.కాబట్టి భారత జట్టుకు కొత్త కోచ్ ను తీసుకొని, జట్టును సెట్ చేయడానికి చాలా సమయం ఉందని తెలిపారు.

ఆ విషయం రాహుల్ ద్రావిడ్ కు కూడా బాగా తెలుసు అని చెప్పడం జరిగింది.

అయితే భారత జట్టు గత కొంతకాలంగా మూడు ఐసీసీ ట్రోఫీల్లో పాల్గొని ఒక్కటి కూడా గెలవలేకపోయినప్పటికీ రాహుల్ ద్రావిడ్ తీరుపై బీసీసీఐ సంతృప్తి వ్యక్తం చేసింది.రాహుల్ ద్రావిడ్ తో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మ జట్టును బాగా మేనేజ్ చేసి, అత్యంత బలమైన క్రికెట్ జట్లలో భారత జట్టు కూడా ఒకటి అని నిరూపించారు.ఈ విషయాలను పరిగణంలోకి తీసుకుని బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోనుంది.

ప్రస్తుతం భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ లో భారత జట్టుకు కు ఎన్సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్( VVS Laxman) ఇన్ ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు.ఒకవేళ రాహుల్ ద్రావిడ్ పదవీకాలం పొడిగించకపోతే అతని స్థానంలో లక్ష్మణ్ భారత జట్టుకు హెడ్ కోచ్ గా నియమించే అవకాశం ఉంది.ప్రస్తుతం ఈ విషయంలో బీసీసీఐ చర్చలు జరుపుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube