వడ్డే నవీన్ అభిమానులకు గుడ్ న్యూస్.. బిగ్ బాస్ 6లోకి హీరో ఎంట్రీ?

తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇప్పటికే బిగ్ బాస్ షో తెలుగు లో 5 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.

 Bb6 Buzz Hero Vadde Naveen Gets Bigg Boss Telugu Season 6 Offer Details, Bigg B-TeluguStop.com

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ తర్వాత ఇటీవల ముగిసిన బిగ్ బాస్ ఓటీటీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది.బిగ్ బాస్ ఓటీటీ అట్టర్ ఫ్లాప్ కావడంతో బిగ్ బాస్ ప్రేమికులు ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 కోసం వెయిట్ చేస్తున్నారు.

ఇకపోతే బిగ్ బాస్ షో ని ఆదరించే వారు ఇష్టపడే వారు ఎంతమంది ఉన్నారో చీదరించుకునే వారు తిట్టేవాళ్లు కూడా అంతే మంది ఉన్నారు.చాలామంది ఈ షోని పనికిమాలిన పనులు,పనికిమాలిన చేష్టలు అని నానా బూతులు తిడుతూ ఉంటారు.

కానీ ఈ షో కి ఉండే వ్యూయర్ షిప్ మరే ఇతర రియాల్టీ షోలకు ఉండదు.దీంతోపాటుగా బిజినెస్ కూడా వందల కోట్ల లాభం ఉండడంతో బిగ్ బాస్ షో నిర్వాహకులు కూడా తిట్టే వాళ్ళు ఏమైనా అనుకోని అనేవారు సీజన్ లను చేసుకుంటూ పోతున్నారు.

ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ ప్రేమికులు ఎదురు చూస్తున్న సీజన్ సిక్స్ ఎప్పటి నుంచి ప్రసారం కాబోతోంది అన్న విషయంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉండగా.ఈ ఏడాది సెప్టెంబర్ 4 నుంచి బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్టు వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.

అయితే మళ్లీ కరోనా కేసులు ఎక్కువ అవుతుండడంతో కంటెస్టెంట్ ల ఎంపిక ఇంకా పూర్తి కాకపోవడంతో ఈసారి కూడా ఆలస్యం తప్పేటట్టు గా కనిపించడం లేదు.

Telugu Bigg Boss, Vadde Naveen, Tollywood, Vaddenaveen-Movie

సెప్టెంబర్ 4న కాకుండా ముందే స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం జూలై 31 ఆదివారం నాడు స్టార్ట్ చేసినా చేయవచ్చు.ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 1, 2 లు జూలై నెలలోనే ప్రారంభం అయ్యాయి.కాబట్టి ఈ రెండు తేదీలలో ఏదో ఒక రోజు బిగ్ బాస్ సీజన్ 6 మొదలు కాబోతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 6 లో ఒకప్పటి హీరో అయినా వడ్డే నవీన్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి.వడ్డే నవీన్ నీ బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురావడానికి షో నిర్వాహకులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

వడ్డే నవీన్ అటు బుల్లితెరపై కానీ ఇటు వెండితెరపై కానీ కనిపించకుండా ఇప్పటికే చాలా ఏళ్లు గడిచిపోయింది.సోషల్ మీడియా లో వినిపిస్తున్న వార్తల ప్రకారం వడ్డే నవీన్ బిగ్ బాస్ సీజన్ 6 లోకి ఎంట్రీ ఇస్తాడో లేదో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube