మెగాస్టార్‌ మనసు దోచేసిన బండ్లన్న.. ఊహించని డిమాండ్‌తో?

తెలుగు సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమై.

 Bandla Ganesh Interesting Proposal To Government On Chiranjeevi, Bandla Ganesh,-TeluguStop.com

పలు సినిమాలలో సహాయ పాత్రలలో నటించాడు.ఇక గబ్బర్ సింగ్, తీన్ మార్ వంటి పలు సినిమాలతో నిర్మాతగా బాధ్యతలు చేపట్టాడు.

వ్యక్తిగత విషయంలో కొన్ని సమయాలలో వివాదాలు కూడా ఎదుర్కొన్నాడు.ఇదిలా ఉంటే తాజాగా మెగాస్టార్ మనసును దోచేశాడు బండ్ల గణేష్.

నిజానికి బండ్ల గణేష్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లను బాగా ఆదరిస్తుంటాడు.ఇక ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాత్రం తెగ పొగుడుతూ ఉంటాడు.నిజానికి పవన్ అంటే ఎంతో అభిమానం చూపిస్తాడు బండ్ల.ఇక సోషల్ మీడియాలో కూడా సమయాన్ని గడుపుతుంటాడు.

ఇదిలా ఉంటే ఆదివారం రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఘనంగా జరిగిన సంగతి అందరికీ తెలిసింది.ఈ నేపథ్యంలో ఈయనకు ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Telugu Bandla Ganesh, Books, Chiranjeevi, Chiru, Tollywood, Space-Movie

అంతేకాకుండా ఆదివారం సాయంత్రం ప్రముఖ దర్శక నిర్మాతలతో ప్రముఖ సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ లో స్పేస్ నిర్వహించగా.ఇందులో దర్శకుడు బాబీ, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, కోన వెంకట్, బండ్ల గణేష్ వంటి పలువురు పాల్గొన్నారు.ఇక బండ్ల గణేష్ చిరంజీవి గురించి మాట్లాడుతూ.ఆయన పుట్టినరోజు అంటే తెలుగువారికి ఒక పండుగ అని తెలిపాడు.

Telugu Bandla Ganesh, Books, Chiranjeevi, Chiru, Tollywood, Space-Movie

కానిస్టేబుల్ కుటుంబం నుంచి చిరంజీవి ఈ స్థాయికి ఎదగడం అంటే మామూలు మాటలు కావు అంటూ తెగ పొగిడాడు.చిరంజీవి చరిత్ర పాఠ్యపుస్తకాల్లో పెడితే.ఆయన చరిత్రను పిల్లలు అందరు చదువుకుంటే చాలా బాగుంటుంది అని తెలిపాడు.అంతేకాకుండా చిరంజీవి చరిత్ర వల్ల పిల్లలకు మరింత ఆదర్శవంతంగా ఉంటుందని, అందుకు చిరంజీవి చరిత్ర భావితరాలకు మంచే జరుగుతుంది అంటూ కొన్ని కామెంట్లు చేశాడు.

ఇక చిరంజీవి సాధించిన ఘనతల గురించి తెగ పొగిడాడు బండ్ల గణేష్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube