సింగర్ వాగ్దేవికి బాలయ్య పొడుపు కథ.. మీకైనా సమాధానం తెలుసా?

సాధారణంగా తెలుగు బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ తెలుగు బుల్లితెర ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నాయి.ఈ క్రమంలోనే ఎన్నో సింగిల్ కాంపిటీషన్ కార్యక్రమాలు, డాన్స్ కాంపిటీషన్ కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి.

 Balakrishna Question To The Singer Vagdevi Do You Know The Answer For That,.bala-TeluguStop.com

మొట్ట మొదటిసారిగా తెలుగు ఓటీటీ ఆహాను నిర్మాత అల్లు అరవింద్ స్థాపించిన విషయం మనకు తెలిసిందే.ఆహా ద్వారా ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తోంది.

ఇప్పటికే ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్, టాక్ షోలు ప్రసారం కాగా మొట్ట మొదటిసారి ఆహా వేదికగా తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ కాంపిటీషన్ ప్రసారమైంది.

ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా సింగర్ శ్రీ రామ చంద్ర వ్యవహరించగా, న్యాయనిర్ణేతగా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్, సింగర్ కార్తీక్ హీరోయిన్, నిత్యా మీనన్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.12 మంది కంటెస్టెంట్ లతో ప్రారంభమైన ఈ కార్యక్రమం గ్రాండ్ ఫినాలేకు చేరుకుంది.ఈ క్రమంలోనే గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరు కానున్నారు.చిరంజీవి చేతుల మీదుగా కంటెస్టెంట్ వాగ్దేవి ఇండియన్ ఐడల్ సింగింగ్ కాంపిటీషన్ విజేతగా నిలబడి ట్రోఫీ అందుకున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ కార్యక్రమంలో ఇదివరకే బాలయ్య బాబు సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.ఇక బాలకృష్ణ ఈ కార్యక్రమంలో భాగంగా కంటెస్టెంట్ లను పలు ప్రశ్నలు అడుగుతూ వారి దగ్గర నుంచి సమాధానాలు రాబట్టారు.

ఈ క్రమంలోనే సింగర్ వాగ్దేవిని బాలకృష్ణ ఒక పొడుపు కథ అడిగారు.మరి ఆ పొడుపు కథ ఏమిటి అనే విషయానికి వస్తే.

ఐదుగురిలో చిన్నవాడు… పెళ్లికి మాత్రం పెద్ద వాడు ఎవరు అంటూ సింగర్ వాగ్దేవికి పొడుపు కథ వేశారు.ఈ విధంగా బాలకృష్ణ అడిగేసరికి సింగర్ వాగ్దేవి సమాధానం చెప్పలేకపోయింది.

Telugu Balakrishna, Indian Idol, Music Ss Taman, Nithya Menon, Karthik, Telugu,

ఇంతకీ బాలయ్య బాబు అడిగిన ఈ పొడుపు కథకు మీకు అయినా సమాధానం తెలుసా? ఏంటి ఈ పొడుపు కథకు సమాధానం తెలియడం లేదా… అదేనండి మన చిటికెన వేలు.ఐదు వేళ్ళల్లో అన్నిటికన్నా చిటికెన వేలు చిన్నది.కానీ పెళ్లిలో మాత్రం చిటికెన వేలు ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉంటుంది.వాగ్దేవి సమాధానం చెప్పకపోయే సరికి బాలయ్య బాబు సమాధానం చెప్పారు.ఇక వాగ్దేవి పొడుపుకథలు సరిగా చెప్పకపోవడంతో బాలకృష్ణ తనకు పెద్దబాలశిక్ష పుస్తకాన్ని బహుమతిగా అందించారు.ఈ విధంగా బాలకృష్ణ ఈ వేదికపై ప్రతి ఒక కంటెస్టెంట్ తో ఎంతో సరదాగా గడిపారు.

ఇకపోతే ఇదివరకే బాలకృష్ణ ఆహా వేదికగా అన్ స్టాపబుల్ అనే టాక్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తు ఈ కార్యక్రమాన్ని నెంబర్ వన్ టాక్ షోగా నిలబెట్టిన ఘనత బాలయ్య బాబుకి చెల్లిందని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube