పెద్దగా మీడియా లో కనపడని చంద్రబాబు కోడలు, బాలకృష్ణ కూతురు నారా బ్రాహ్మణి ఇప్పుడు మీడియా కి ఆసక్తికర విషయాలు తెలిపారు.తన పర్సనల్ విషయాలు తెలుపుతూ ఇంట్లో , అత్తారింట్లో తాను ఎలా ఉంటాను అనీ ఎవరెవరు ఎలా మెలుగుతారు అనీ చెప్పుకొచ్చారు.ఆమె చెప్పిన ప్రతీ విషయం ఏపీ లో అత్యంత ప్రముఖుల గురించే మరి.
– తాత గారు రామారావుగారి తో చాలా సాన్నిహిత్యం ఉండేది.ఉదయం నాలుగు గంటలకే లేచే అలవాటు ఉంది ఆయన కి.మేమూ అప్పుడే లేచి ఆయనతో చికెన్ తినే వాళ్ళం.ఆ సమయం లో చికెన్ తినాలి అని చెబుతూ ఉండేవారు ఆయన.చాలా సరదా మనిషి.
– మామాగారు , అత్తగారూ ఇద్దరితో నాకు చనువు ఎక్కువే.చాలా స్వేచ్చ ఇస్తారు .ఇళ్ళు మారాయి అంతే కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది.
– మామ గారు అత్త గారూ ఇద్దరూ బాగా సపోర్ట్ ఇస్తారు అత్తగారు సలహాలు.సూచనలు ఇస్తుంటారు.ఆమె రోజూ ఉదయాన్నే నాలుగు గంటలకే నిద్ర లేచి.వ్యాయామం చేసి.ఇంట్లో అంతా సవ్యంగా ఉందో లేదో చూసుకుంటారు.
దూర ప్రయాణాలూ చేస్తారు.ఒంటిచేత్తో అన్ని పనులూ చక్కబెడతారు.ఆ చాకచక్యాన్ని ఆమె నుంచి నేర్చుకున్నా.
– నాన్న నాకు బెస్ట్ ఫ్రెండ్ , ఆయన్ని సరిగ్గా అర్ధం చేసుకోవాలి, లేకపోతే కష్టం
– మా ఇంట్లో ఉదయం ఆరింటికే దినచర్య మొదలై రాత్రి 10 గంటలకు ముగుస్తుంది.ఉదయం లేచిన తర్వాత ఇంట్లో అందరూ వ్యాయామం చేస్తారు.దేవాన్ష్ తో కాసేపు గడిపి.తనకి ఏమేం కావాలో చూసుకుని.ఆ తర్వాత పనిలో నిమగ్నమవుతాం.
నేను పనిలో ఉంటే అమ్మ తనను చూసుకుంటుంది.ఉమ్మడి కుటుంబం కారణంగానే అన్నీ పనుల్ని సక్రమంగా చేయగలుగుతున్నా.
ఇలా తన పర్సనల్ విశేషాలు చెప్పుకొచ్చింది
.