మూడో టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయం.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో స్థానం..!

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్ వేదికగా జరిగిన ఇండియా- ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.మూడు టెస్ట్ మ్యాచ్ లలో, రెండు టెస్ట్ మ్యాచ్లను సమర్ధవంతంగా ఆడి ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్, ఇండోర్లో జరిగే మూడవ టెస్ట్ మ్యాచ్లో కాస్త తడిబడి ఘోరంగా విఫలం అయింది.

 Australia's Victory In The Third Test Match.. A Place In The Final Of The World-TeluguStop.com

దీనికి కారణాలు ఏమైనా కావచ్చు కానీ ఆస్ట్రేలియా మూడవ టెస్టులో గెలిచి పరువు కాపాడుకుంది.

అంతే కాదు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా స్థానం దక్కించుకుంది.2021-23 సీజన్లో ఆస్ట్రేలియా 11 విజయాలు సాధించింది.ఇండియా మాత్రం పది విజయాలు సాధించి రెండో స్థానంలో నిలిచింది.

టీం ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో స్థానం సంపాదించాలంటే అహ్మదాబాద్ వేదికగా జరగనున్న నాలుగో టెస్ట్ గెలవకపోయినా కనీసం డ్రా చేసుకుంటే ఫైనల్ కు అర్హత సాధించినట్లే.ఒకవేళ నాలుగో టెస్టులో ఓడిపోతే భారత్ ఫైనల్ కు వెళ్లే అవకాశం కోల్పోయినట్లే.

ఒకవేళ ఈ అవకాశం చేజారితే టీమిండియా భవితవ్యం శ్రీలంకపై ఆధారపడినట్టే.శ్రీలంక రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది.ఈ సిరీస్ లో ఒక మ్యాచ్ గెలిచి, మరొక మ్యాచ్ ఓడిపోతే భారత జట్టు ఫైనల్ కు వెళ్తుంది.ఇంగ్లాండ్ వేదికగా జూన్ లో జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియా భారత్ లేదా శ్రీలంకతో తలపడనుంది.

ఒకవేళ రెండు మ్యాచ్లలో శ్రీలంక గెలిస్తే ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య డబ్ల్యుటిసి ఫైనల్ జరగనుంది.శ్రీలంక, కివీస్ పై గెలవడం అనేది ఒక పెద్ద సవాల్.ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం న్యూజిలాండ్ గెలిచే అవకాశాలే కనిపిస్తున్నాయి.ఇదే జరిగితే ఫైనల్ లో ఆస్ట్రేలియా భారత్ మధ్య మ్యాచ్ జరిగే అవకాశం ఉంది.

తొలి టెస్ట్ ఛాంపియన్షిప్ లో న్యూజిలాండ్ విన్నర్ అయితే, భారత్ రన్నర్ గా నిలిచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube