ఆస్ట్రేలియాకు చెందిన విక్టోరియా బీహార్ నివాసి జైప్రకాష్‌ను ఇష్టపడింది.అంతే.
ఆమె సప్తసముద్రాలు దాటి బీహార్‌లోని అతనుండే గ్రామానికి చేరుకుంది.ఆ తర్వాత విక్టోరియా, జయప్రకాష్‌లు హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు.
బక్సర్ జిల్లా కుకుధా గ్రామానికి చెందిన నంద్‌లాల్ సింగ్ యాదవ్ కుమారుడు జైప్రకాష్ చదువు కోసం మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియా వెళ్లాడు.అక్కడ అతను మెల్‌బోర్న్ నగరంలోని గీలాంగ్ నివాసి విక్టోరియాను కలిశాడు.
ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం చివరికి ప్రేమగా మారింది.ఈ సమయంలో జయప్రకాష్‌కు ఓ కంపెనీలో ఉద్యోగం లభించింది.
దీని తర్వాత ఆ ప్రేమ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.ఈ విషయమై కుటుంబీకులతో మాట్లాడేందుకు ఆ ప్రేమ జంట తటపటాయించింది.
తరువాత వారు ధైర్యం చేసి తమ కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిపింది.
వారి పెళ్లికి ఇరు కుటుంబాలు సమ్మతించాయి.
అయితే జయప్రకాష్ తండ్రి ఈ పెళ్లి బీహార్‌లోనే జరగాలని షరతు పెట్టాడు.విక్టోరియా కుటుంబం ఈ షరతును అంగీకరించడానికి పెద్దగా ఇబ్బంది పడలేదు.
ఆ తర్వాత పెళ్లి డేట్ ఫిక్స్ చేశారు.విక్టోరియా ఏప్రిల్ 19న తన తండ్రి స్టీవెన్ టాల్కెట్, తల్లి అమెండా టాల్కెట్‌తో కలిసి కుకుధ గ్రామానికి చేరుకుంది, విక్టోరియా, జయప్రకాష్‌ల వివాహం ఏప్రిల్ 20 రాత్రి హిందూ ఆచారాల ప్రకారం జరిగింది.
విక్టోరియా తాను జయప్రకాష్‌ని పెళ్లి చేసుకోవడం తన అదృష్టమని భావిస్తోంది.ఈ పెళ్లితో ఇరు కుటుంబాల వారు చాలా సంతోషంగా ఉన్నారు.
విక్టోరియా తండ్రి స్టీవెన్ టాల్కెట్ బీహారీ సంస్కృతిపై ఇష్టం వ్యక్తం చేశారు.ఇక్కడి ఆచార వ్యవహారాలు, సంస్కృతిని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు.
విక్టోరియా తండ్రి తన కుమార్తెకు కన్యాదానం చేశారు.తన కూతురు తన అత్తమామల ఇంట్లో సంతోషంగా ఉంటుందని స్టీవెన్ ఆశాభావం వ్యక్తం చేశారు.