కాకినాడ జిల్లా తునిలో టీడీపీ నేతపై హత్యాయత్నం

కాకినాడ జిల్లా తునిలో టీడీపీ నేతపై హత్యాయత్నానికి ప్రయత్నించిన ఘటన కలకలం సృష్టిస్తోంది.భవనిమాల వేసుకుని వచ్చిన దుండగుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు.

 Attempted Assassination Of Tdp Leader In Tuni Of Kakinada District-TeluguStop.com

అనంతరం బైకుపై పరారైయ్యాడు.ఈ దాడిలో టీడీపీ నేత, మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావు తీవ్రంగా గాయపడ్డారు.

వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.కాగా ఆయన చేతిపై, తలకు బలమైన గాయాలైనట్లు తెలుస్తోంది.

దుండగుడు కత్తితో దాడి చేసిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డ్ అయ్యాయి.హత్యాయత్నం ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube