కాకినాడ జిల్లా తునిలో టీడీపీ నేతపై హత్యాయత్నం
TeluguStop.com
కాకినాడ జిల్లా తునిలో టీడీపీ నేతపై హత్యాయత్నానికి ప్రయత్నించిన ఘటన కలకలం సృష్టిస్తోంది.
భవనిమాల వేసుకుని వచ్చిన దుండగుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు.అనంతరం బైకుపై పరారైయ్యాడు.
ఈ దాడిలో టీడీపీ నేత, మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావు తీవ్రంగా గాయపడ్డారు.
వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.కాగా ఆయన చేతిపై, తలకు బలమైన గాయాలైనట్లు తెలుస్తోంది.
దుండగుడు కత్తితో దాడి చేసిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డ్ అయ్యాయి.హత్యాయత్నం ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తండేల్ తో సాయి పల్లవి నాగ చైతన్యకి సక్సెస్ ఇస్తుందా..?