మీ వంటగదిలో ఈ చిన్నపాటి మార్పులు చేస్తే.. ఇక ధనవర్షమే!

మన ఇంటి నిర్మాణం చేపడితేనే వాస్తు నియమాలను పాటిస్తాం.ఎందుకంటే వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం చేపడితేనే.

 As Per Vastu Shastra Follow These Tips In Kitchen Room For Auspicious, Directio-TeluguStop.com

ఆ ఇంట్లో నివాసించేవారు ఏ బాధలు పడకుండా.సుఖసంతోషాలతో ఉంటారు.

దీన్ని నమ్మేవారు చాలా మందే ఉన్నారు.ఇంటికి ఎనిమిది దిక్కులు ప్రధానమే! వీటిని అనుకరించి నిర్మాణాలు చేపట్టాలని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తారు.

అలా కాకుండా ఇష్టానుసారంగా ఇంటి నిర్మాణం చేపడితే.ఆ ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీ ప్రవేశించి, అష్టకష్టాలు పడాల్సి వస్తుందట.

ఈ రోజు మన వంటగదిలో ఏ దిక్కున ఏ వస్తువులు పెడితే మన ఇంటికి శుభం కలుగుతుందో తెలుసుకుందాం.

సాధారణంగా మన ఇంటి నిర్మాణంలో వంటగదిని ఆగ్నేయ దిశలో నిర్మించుకుంటాం.

అయితే, అందులో కూడా కొన్ని పాటించాలి.ముఖ్యంగా నీరు ప్రయాణించే దిÔ¶ కూడా ముఖ్యమే.

కిచెన్‌లో వాటర్‌ ట్యాప్, సింక్‌ అన్నీ ఉత్తర దిశలో ఉండాలట.ఇది ఇండిపెండెంట్‌ ఇళ్లతోపాటు ఫ్లాట్‌లలో ఉన్న వారికి కూడా వర్తిస్తుంది.

నీటికి సంబంధించిన ఏ వస్తువు అయినా ఉత్తర దిశలోనే ఉండాలి.తాగేనీటి కంటేయినర్‌ కూడా.

ఉత్తరం నుంచి తూర్పు దిశగా ఇవి ఉండాలి.వీటి దిశను ఎట్టి పరిస్థితుల్లో మరో దిశకు మార్చకూడదట.

పప్పూ ఉప్పులు

Telugu Hall, Kitchen, Kitchen Tips, Niruthi, Vastu Sastram-Latest News - Telugu

వంటగదిలో మనం ప్రతిరోజూ వంటల్లో వాడే వస్తువుల దిశ కూడా ముఖ్యమే.సాధారణంగా మనం తినే ఆహార పదార్థాలకు తక్కువ రోజుల్లోనే పాడవుతాయి.అందుకే వీటిని శుభ్రమైన ప్రదేశంలో పెట్టుకోవాలి.వాస్తు శాస్త్రం ప్రకారం కూడా ఈ పప్పూ ఉప్పులను ఏ దిశలో పెడితే శుభమో తెలుసుకుందాం.కిచెన్‌లో ప్రతిరోజూ వాడే ఆహార ధాన్యాలను పడమర దిశలో పెట్టుకోవాలట.దీనికి సంబంధించిన షెల్ఫ్‌ను కూడా వెస్ట్‌ డైరెక్షన్‌లో నిర్మించుకుంటే అక్కడ ఇవి భద్ర పరచడానికి సులువవుతుంది.

Telugu Hall, Kitchen, Kitchen Tips, Niruthi, Vastu Sastram-Latest News - Telugu

పైగా ఈ దిశలో వీటిని పెట్టుకుంటేవాస్తు శాస్త్రం ప్రకారం అవి ఎప్పుడూ నిండుకోవంటారు.అందుకే పడమర దిశ వీటికి కలిసివస్తుంది అంటారు.మరి ఇతర ఆహార పదార్థాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండే వస్తువులను కూడా సరైన దిశలో ఏర్పాటు చేసుకోవాలి.కిచెన్‌లో వీటికి సంబంధించిన ప్రత్యేక స్టోరేజీని నిర్మించాలనుకుంటే నైరుతి దిశ మంచిది.

అంతేకాదు డైనింగ్‌ హాల్‌ నిర్మాణం కూడా పడమర దిశగా ఏర్పాటు చేసుకుంటే ఆ ఇంటికి శుభం కలుగుతుంది.అటువంటి ఇంట్లో నివసించేవారు ఎల్లప్పుడు సుఖసంతోషాలతో ఉంటారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube