అమెరికాలో నానాటికి అక్రమ వలసలు పెరిగిపోతున్నాయని అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం ప్రకటించింది.అమెరికాలో సక్రమంగా ప్రవేసించే ఎన్నారైలలో కూడా భారత్ మొదటి స్థానంలోనే ఉండటం గమనార్హం.
అమెరికా ఎంతగా నియంత్రిస్తున్నా సరే అమెరికాలోకి అక్రమంగా చేరుకునే భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది అంటున్నారు.
అయితే ట్రంప్ విధానాల వలన ఇప్పటికే ఎంతో మంది వలసదారులపై నిర్భంధం విధించిన సంగతి తెలిసిందే అయితే ఈ పట్టుబడ్డ వారిలో సైతం భారతీయులే అధికంగా ఉన్నారట.అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించినపుడు అదుపులోకి తీసుకున్న భారతీయుల సంఖ్య ఈ ఏడాది మూడు రెట్లు పెరిగిందని యూఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ విభాగం ప్రకటించింది.
సెప్టెంబర్ 30 వరకు దాదాపు 9 వేల మంది భారతీయులను సరిహద్దుల్లో అరెస్ట్ చేసినట్టు సీబీపీ అధికారి వెల్లడించారు…వీరిలో 4వేల మంది దాకా అమెరికాలోకి అక్రమ ప్రవేశానికి అనుకూలంగా ఉందని భావిస్తున్న మెక్సికాలి సరిహద్దు కంచెను దాటి వచ్చినట్టు చెప్పారు.
అయితే వీరిని నిలువరించడానికి అమెరికా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి
.