మన శరీరాన్ని రిలాక్స్ చేయడం కోసం అప్పటికప్పుడైతే ఏం చేస్తాం? ఒళ్లు విరవడం, కొంత సేపు లేచి అటు, ఇటు నడవడం లేదా టీ, కాఫీ వంటివి తాగడం లాంటి పనులు చేస్తాం.అయితే వీటితోపాటు మరొకటి కూడా చేస్తాం.
అదేంటంటే చేతి వేళ్లు విరవడం… బాగా నొప్పిగా ఉన్నప్పుడు లేదా కంప్యూటర్ కీబోర్డుపై ఎక్కువగా పనిచేసే వారు తమ చేతి వేళ్లను ఎక్కువగా విరుస్తారు.ఇలా విరిచే క్రమంలో టక్‌మనే శబ్దం కూడా వాటి నుంచి వస్తుంది.అయితే ఆ శబ్దం ఎందుకు వస్తుంది? అలా విరవడం వల్ల లాభమా, నష్టమా?
చేతి వేలి జాయింట్లలో సైనోవియల్ ద్రవం ఒకటి ఉంటుంది.దీంట్లో ఓ రకమైన గ్యాస్ ఎప్పటికప్పుడు నిండిపోతుంది.దీంతో చేతి వేళ్లను విరిచినప్పుడు ఈ గ్యాస్ తొలగించబడి దాని స్థానంలో మనకు శబ్దం వినిపిస్తుంది.పలువురు పరిశోధకులు ఇదే విషయంపై పుల్ మై ఫింగర్ స్టడీ పేరిట ఓ పరిశోధన చేశారు.
ఈ నేపథ్యంలో వారు ఒక వ్యక్తి తన చేతి వేళ్లను విరిచినప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం ఓ ఎంఆర్‌ఐ పరికరం ద్వారా పరిశోధనను రికార్డ్ చేశారు.ఈ పరిశోధనకు గ్రెగ్ కౌచక్ అనే శాస్త్రవేత్త నాయకత్వం వహించాడు.
వాక్యూమ్‌తో నిండి ఉండే ఓ ప్రత్యేకమైన కేబుల్‌ను పరిశోధనలో పాల్గొన్న వ్యక్తి చేతి వేళ్లకు ఉంచారు.దీన్ని ఎంఆర్‌ఐ పరికరానికి అనుసంధానం చేశారు.ఈ క్రమంలో ఆ వ్యక్తి చేతి వేళ్లను విరవగానే వాటికి అనుసంధానమైన కేబుల్స్ లాగబడి ఎంఆర్‌ఐ పరికరం వ్యక్తి చేతిని స్కానింగ్ చేసి రికార్డ్ చేసింది.ఎప్పటిలాగే ఈసారి కూడా టక్‌మని శబ్దం వినిపించింది.
చేతివేళ్లను విరవడం వలన కలిగే మరిన్ని లాభనష్టాలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
చేతివేళ్లను విరుస్తుంటే వేళ్లు విరవకు,గోళ్లు కొరకకు అరిష్టం అని పెద్దవాళ్లు అనే మాటలు మీరు వినే ఉంటారు.
గోళ్లు కొరికితే గోళ్లల్లో ఉండే మురికి వలన హాని కలుగుతుంది కాబట్టి ఒకే.కానీ అయితే ఇలా చేతి వేళ్లను విరవడం వల్ల మనకు లాభమే కలుగుతుందట.నష్టం కలుగుతుందనుకుంటే అది అపోహే అవుతుందట.ఎందుకంటే ఇలా చేయడం వల్ల కీళ్ల నొప్పులు, కీళ్ల జబ్బులు మాత్రం రావు అని చెప్తున్నారు .