బిగ్ బాస్ సీజన్ సెవెన్( Bigg Boss 7 ) కార్యక్రమం నేటితో పూర్తి కానుంది.నేడు విన్నర్ ఎవరో అనే విషయం తెలియనుంది.
ఇప్పటికే సోషల్ మీడియాలో బిగ్ బాస్(Bigg Boss) విన్నర్ పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) అంటూ పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఫినాలేలో ఉన్నటువంటి ఆరుగురు కంటెస్టెంట్లలో మొదట అర్జున్ అంబటి(Arjun Ambati) హౌస్ నుంచి బయటకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.
అయితే ఈయన హౌస్ లో దాదాపు పది వారాల పాటు కొనసాగారు.ఇక ఈయన హౌస్ నుంచి ఎలిమినేట్ కావడంతో 10 వారాలపాటు బిగ్ బాస్ హౌస్లో కొనసాగినటువంటి ఈయనకు ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకున్నారని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
![Telugu Arjun Ambati, Bigg Boss, Biggboss, Ramcharan-Movie Telugu Arjun Ambati, Bigg Boss, Biggboss, Ramcharan-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/12/Arjun-ambati-bigg-boss-remuneration-detailsa.jpg)
బిగ్ బాస్ కార్యక్రమంలోకి అర్జున్ ఐదవ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టారు ఇలా వైల్డ్ కార్డు ద్వారా ఈయన హౌస్ లోకి వెళ్లడంతో పది వారాలపాటు హౌస్ లో కొనసాగారు.ఇకపోతే ఈయన మొదటి లోనే బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి ఉంటే తప్పకుండా టైటిల్ రేసులో ఉండేవారు అంటూ కొందరు భావిస్తున్నారు.ఇక అర్జున్ 13వ వారమే ఎలిమినేట్ కావాల్సి ఉండగా ఈయన టాప్- ఫినాలే టికెట్ పొందటంతో ఎలిమినేషన్ నుంచి తప్పుకున్నారు.
![Telugu Arjun Ambati, Bigg Boss, Biggboss, Ramcharan-Movie Telugu Arjun Ambati, Bigg Boss, Biggboss, Ramcharan-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/12/Arjun-ambati-bigg-boss-remuneration-detailssa.jpg)
ఇలా 10 వారాలపాటు హౌస్ లో కొనసాగినటువంటి అర్జున్ అంబటి భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలుస్తుంది.ఈయన సీరియల్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అయ్యారు.దీనితో ఈయన బిగ్ బాస్ లో కొనసాగడం కోసం వారానికి 2.45 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తుంది ఇలా పది వారాలపాటు హౌస్ లో కొనసాగినటువంటి అర్జున్ 24.5 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలుస్తోంది.ఇక ఈయన బిగ్ బాస్ లో కొనసాగుతున్న సమయంలోనే సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు.అర్జున్ బుచ్చిబాబు రామ్ చరణ్ (Ram Charan) కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో ఒక పాత్రలో నటించబోతున్నట్లు డైరెక్టర్ బుచ్చిబాబు స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే.