దిగ్గజ యాపిల్ తమ వినియోగదారులకు ఒక ముఖ్య సమాచారం తెలిపింది.యాపిల్ దాని సంబంధిత ఉత్పత్తులకు ఎటువంటి క్లీనర్‌లతో శుభ్రం చేయకూడదో సూచించింది.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇష్టానుసారంగా ఏవేవో కంపెనీలకు చెందిన డిస్‌ఇన్ఫెక్టరీ లిక్వీడ్‌లు మార్కెట్లోకి వచ్చేశాయి.అందులో కొన్ని మంచి బ్రాండేడ్ ఉత్పత్తులు ఉంటే మరికొన్ని లిక్వీడ్‌లతో శుభ్రం చేస్తే స్మార్ట్ ఫోన్ల లోపలికి, బయటవైపు ఉంటే గ్లాస్‌కు స్ప్రే చేస్తే అవి పాడైపోయే ప్రమాదం ఉంటుంది.
అయితే, యాపిల్ కొన్ని రసాయనాలు ఉండే డిస్‌ఇన్ఫెక్షన్ లిక్వీడ్‌లను అస్సలు వాడకూడదని తెలిపింది.ఆ వివరాలు తెలుసుకుందాం.
యాపిల్ స్మార్ట్ ఫోన్ల వినియోగదారులకు ఓ ఐఫోన్స్ క్లీన్ చేయడంపై గైడ్‌లైన్స్ జారీ చేసింది.తమ స్మార్ట్ యాపిల్ కంపెనీలకు చెందిన ఉత్పత్తులను ఏ క్లీనర్‌తో డిస్‌ఇన్ఫెక్ట్ చేయాలో సూచించింది.
ప్రధానంగా హైడ్రోజన్ పెరాక్సైడ్ లేదా బ్లీచ్ ఉన్న క్లీనర్‌ను అస్సలు వాడకూడదని తెలిపింది.మ్యాక్, యాపిల్ సంస్థలు హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉన్న డిస్‌ఇన్ఫెంక్టెడ్ క్లీనర్‌లతో ఫోన్లను క్లీన్ చేయడానికి వాడకూడదని తెలిపింది.
ఇది వరకు చెప్పిన విధంగా బ్లీచ్‌ను వాడకూడదు.క్లోరక్స్ డిస్‌ఇన్ఫెక్టింగ్ వైప్‌లను స్మార్ట్‌ఫోన్లకు ఇతర యాపిల్ ఉత్పత్తులకు వినియోగించవచ్చని 2020లో కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలోనే తెలిపింది.
ఒకవేళ వినియోగదారులకు కచ్చితంగా డిస్‌ఇన్ఫెక్షన్ లిక్విడ్‌లు వాడాలనుకుంట 70 శాతం ఐసోప్రొపైల్ ఆల్కహాల్ వైప్‌లను, 75 శాతం ఈథైల్ ఆల్కహాల్ వైప్, క్లోరక్స్ వైప్స్‌తో సున్నితంగా స్మార్ట్ మొబైల్‌లను తుడవాలి.

నాన్ పోరస్ పై భాగాన్ని డిస్‌ప్లే, కీబోర్డు, ఇతర బయటి వైపు ఉత్పత్తులకు బ్లీచ్, హైడ్రోజన్ పెరాక్సైడ్ లేని క్లీనర్‌లను వాడాలి.ఎయిరోసల్ స్ప్రేస్ అబ్రేసివ్ ఉత్పత్తులకు కూడా యాపిల్ వాడకూడదని తెలిపింది.స్మార్ట్ ఫోన్లకు ఏదైనా చిన్నపాటి రంధ్రాలు ఉంటే.
స్మార్ట్ ఫోన్ల లోపలి వైపునకు లిక్విడ్ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.ఛార్జింగ్ పెట్టిన స్మార్ట్‌ఫోన్లకు కూడా డిస్‌కనెక్ట్ చేయకుండా తుడవకూడదు.
ఎందుకంటే లిక్విడ్‌లు తడిగా ఉంటాయి కాబట్టి కరెంట్ షాక్ తగిలే అవకాశం ఉంటుంది.ముఖ్యంగా యాపిల్ స్మార్ట్ ఫోన్లకు సున్నితమైన గుడ్డతో తుడవాలి.
టవల్ లేదా పేపర్‌తో తుడిస్తే స్మార్ట్‌ఫోన్ గ్లాస్ డిమ్ అయి పోతుంది.అంతేకాదు ఫోన్లపై నేరుగా స్ప్రేలు వాడకూడదు.