ఒకే ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీ లోకి వచ్చి అన్నయ్యలు సక్సెస్ అవ్వలేక తమ్ముళ్లు మాత్రమే సక్సెస్ అయిన హీరోలు ఎవరు ఉన్నారో ఒకసారి తెలుసుకుందాం…మొదటగా రమేష్ బాబు గురించి తెలుసుకుందాం…సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన రమేష్ బాబు( Ramesh babu ) సినిమాల్లో హీరో గా సక్సెస్ అవ్వలేకపోయాడు అందుకే కొన్ని సినిమాలు చేసి ఫెడ్ అవుట్ అయి పోయాడు.రమేష్ బాబు సక్సెస్ అవ్వలేదు కానీ వల్ల కుటుంబం నుంచి వచ్చిన రమేష్ బాబు తమ్ముడు కృష్ణ రెండో కొడుకు అయిన మహేష్ బాబు( Mahesh babu ) మాత్రం సూపర్ స్టార్ అయ్యాడు…

ప్రస్తుతం మహేష్ బాబు వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో టాప్ హీరో గా గుర్తింపు పొందుతున్నాడు.ఇక ఈయన ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో గుంటూరు కారం( Guntur Kaaram ) అనే సినిమా చేస్తున్నాడు.ఇది అయిపోయాక రాజమౌళి డైరెక్షన్ లో ఇంటర్నేషనల్ ఫిలిం ఒకటి చేస్తున్నాడు దింతో మహేష్ బాబు ఇండియా లోనే నెంబర్ వన్ స్టార్ గా ఎదగడం గ్యారంటీ అని చాలా మంది సినిమేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు…

ఇక వీళ్ల తర్వాత ఇ వి వి సత్యనారాయణ కొడుకులు అయిన ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ ఇద్దరు ఇండస్ట్రీ కి వచ్చారు కానీ అందులో ఆర్యన్ రాజేష్ పెద్దగా సక్సెస్ అవ్వలేకపోయాడు కానీ అల్లరి నరేష్( Allari Naresh ) మాత్రం కామెడీ సినిమాలు తీసుకుంటు వస్తు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ఇప్పుడు మాత్రం అన్ని సీరియస్ సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నాడు…అయితే ఇప్పుడు ఆర్యన్ రాజేష్ కూడా కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ తనుకూడా ప్రస్తుతం ఇండస్ట్రీ లో బిజీ గా ఉంటున్నాడు…అందులో భాగంగానే రామ్ చరణ్ హీరో గా వచ్చిన వినయ విధేయ రామ సినిమా లో నటించాడు…