జర్నలిస్టులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. !

జర్నలిస్టులంటే ప్రభుత్వాల దృష్టి లో విలువ లేని వారిలా మిగిలి పోతున్నారనే ఆవేదన ఇంతకు ముందు ఉండేది.కానీ వారికి కొన్ని హక్కులుంటాయని, సమయంతో పాటే పరిగెత్తే శ్రామికుడే జర్నలిస్టు అని అప్పుడప్పుడు గుర్తిస్తున్న ప్రభుత్వాలు ఏదో చిన్న చిన్న పధకాలతో జర్నలిస్టులను సంబర పరుస్తున్నాయట.

 Ap Govt Good News For Journalists, Ap Govt, Good News, Journalists, Accreditatio-TeluguStop.com

ఇక జర్నలిస్టులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది.ఈరోజు సమాచార, ప్రసారశాఖ మంత్రి పేర్ని నాని, అధికారులతో నిర్వహించిన సమావేశం లో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచించాలని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి సూచించగా సానుకూలంగా స్పందించిన ఆయన త్వరలో రాష్ట్రంలోని 25 వేల మంది జర్నలిస్టులకు అక్రిడేషన్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు.

ఇకపోతే వార, పక్ష, మాస పత్రికలకు సర్క్యులేషన్ బట్టి అక్రిడేషన్లు కేటాయిస్తారని సమాచారం. ఇప్పటి వరకు అక్రిడేషన్ల కోసం ఎదురుచూస్తోన్న జర్నలిస్టులకు ఇది శుభవార్తే.మరి ఇలాంటి వార్త తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు చెబుతుందో అని అనుకుంటున్నారట ఈ రాష్ట్ర జర్నలిస్టులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube