ఎన్నారైలు ఎంతో తమకి కావాల్సిన వస్తువులు తమ తమ స్వదేశాల నుంచీ తెచ్చుకోవాలి అంటే ఎంతో కష్టతరం అయితే ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఉన్నా చార్జీల కి భయపడి ఆ సాహసం చేయరు ఎంతో అవసరం అనుకుంటే తప్ప.అలాగే విదేశాల నుంచీ ఎన్నారైలు ఇక్కడకి ఏదన్నా పంపాలి అంటే కూడా ఆ విధానం చాల ఖటిన తరంగా ఉంటుంది పార్శిల్ చేసిన సరుకు వస్తువు.
విమానంలో ఎయిర్‌పోర్టుకు రావాలి.అక్కడి కస్టమ్స్ అధికారుల తనిఖీలు పూర్తవ్వాలి.
ఆ తర్వాత ఆయా కొరియర్ సర్వీసు ఔట్‌లెట్‌కు చేరుకోవాలి.అక్కడి నుంచి సంబంధిత చిరునామాకు చేరుకుంటుంది.
ఇంత తతంగం జరిగేతే గానీ సంబంధీలకు వస్తువు చేరదు.
అయితే ఇప్పుడు ఇలాంటి విధానాలకి స్వస్తి చెప్పేయచ్చు అంటున్నారు మన భారత తపాలా శాఖ వారు.ఇక్కడి నుంచీ విదేశాలకి కానీ అక్కడి నుంచీ ఇక్కడికి గాని తమ వస్తువాలని అతి తక్కువ సమయానికే వినియోగదారుల కి చేరవేస్తామని అంటున్నారు అయితే ఈ రకమైన ఫారిన్ పోస్టాఫీసు శాఖని విజయవాడలో మొట్టమొదటి సారిగా ఏర్పాటు చేయబోతున్నారు…రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ శాఖను ఏర్పాటు చేసుకోబోతున్న తొలి నగరం విజయవాడ కావడం విశేషం.
విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌కు పక్కన ఉన్న తపాల శాఖ కార్యాలయంలో ఫారిన్ సబ్ పోస్టాఫీసును ఏర్పాటు చేయనున్నారు.
తపాల శాఖ అధికారులు.దాదాపు రూ.2 కోట్లతో ఈ పోస్టాఫీసును ఏర్పాటు చేయబోతున్నారు.రెండు, మూడు నెలల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి…ఈ విధానం ఎన్నారైలకి ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ సర్వీసు ప్రారంభించిన తరువాత వినియోగ దారుడు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తారాని ధీమా వ్యక్తం చేస్తున్నారు.