ఎన్నారైలు వాడుకోండి... ఆంధ్రాలో ఫారిన్ సబ్ పోస్టాఫీస్

ఎన్నారైలు ఎంతో తమకి కావాల్సిన వస్తువులు తమ తమ స్వదేశాల నుంచీ తెచ్చుకోవాలి అంటే ఎంతో కష్టతరం అయితే ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఉన్నా చార్జీల కి భయపడి ఆ సాహసం చేయరు ఎంతో అవసరం అనుకుంటే తప్ప.

అలాగే విదేశాల నుంచీ ఎన్నారైలు ఇక్కడకి ఏదన్నా పంపాలి అంటే కూడా ఆ విధానం చాల ఖటిన తరంగా ఉంటుంది పార్శిల్‌ చేసిన సరుకు వస్తువు.

విమానంలో ఎయిర్‌పోర్టుకు రావాలి.అక్కడి కస్టమ్స్‌ అధికారుల తనిఖీలు పూర్తవ్వాలి.

ఆ తర్వాత ఆయా కొరియర్‌ సర్వీసు ఔట్‌లెట్‌కు చేరుకోవాలి.అక్కడి నుంచి సంబంధిత చిరునామాకు చేరుకుంటుంది.

ఇంత తతంగం జరిగేతే గానీ సంబంధీలకు వస్తువు చేరదు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అయితే ఇప్పుడు ఇలాంటి విధానాలకి స్వస్తి చెప్పేయచ్చు అంటున్నారు మన భారత తపాలా శాఖ వారు.

ఇక్కడి నుంచీ విదేశాలకి కానీ అక్కడి నుంచీ ఇక్కడికి గాని తమ వస్తువాలని అతి తక్కువ సమయానికే వినియోగదారుల కి చేరవేస్తామని అంటున్నారు అయితే ఈ రకమైన ఫారిన్ పోస్టాఫీసు శాఖని విజయవాడలో మొట్టమొదటి సారిగా ఏర్పాటు చేయబోతున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ శాఖను ఏర్పాటు చేసుకోబోతున్న తొలి నగరం విజయవాడ కావడం విశేషం.

విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌కు పక్కన ఉన్న తపాల శాఖ కార్యాలయంలో ఫారిన్‌ సబ్‌ పోస్టాఫీసును ఏర్పాటు చేయనున్నారు.

తపాల శాఖ అధికారులు.దాదాపు రూ.

2 కోట్లతో ఈ పోస్టాఫీసును ఏర్పాటు చేయబోతున్నారు.రెండు, మూడు నెలల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ఈ విధానం ఎన్నారైలకి ఎంతగానో ఉపయోగపడుతుంది.ఈ సర్వీసు ప్రారంభించిన తరువాత వినియోగ దారుడు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తారాని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఒక్క లిప్ లాక్ సీన్ కోసం 37 టేకులు.. ఆ సీన్ గురించి హీరో రియాక్షన్ ఇదే!