ఈ టాలెంట్ కూడా ఉందా?.. నవ్వులు పూయిస్తున్న యాంకర్ వర్షిణి

ఈమధ్య సోషల్ మీడియాలో ఎన్నో రకాల రీల్స్ వీడియోస్ యూజర్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.దాంతో యూజర్లు కూడా ఆ రీల్స్ చేయకుండా ఉండటం లేదు.

 Anchor Varshini Funny Dialogue Video Going Viral On Social Media Details, Anchor-TeluguStop.com

ఇక సెలబ్రెటీలు మాత్రం రోజు ఏదో ఒక రీల్ తో తెగ సందడి చేస్తున్నారు.సమయం దొరికినప్పుడల్లా ఫన్నీ వీడియోస్, డాన్స్ వీడియోస్ చేస్తూ ఫాలోవర్స్ ను బాగా ఆకట్టుకుంటున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా బుల్లితెర ఆర్టిస్ట్ వర్షిణి కూడా రీల్స్ చేస్తూ తెగ నవ్వులు పూయించింది.బుల్లితెర హాట్ యాంకర్, ఆర్టిస్టుగా గుర్తింపు పొంది యువతను కన్నార్పకుండా చేస్తుంది గ్లామర్ బ్యూటీ యాంకర్ వర్షిణి.

ఇక ఈమె పరిచయం గురించి బుల్లితెర ప్రేక్షకులందరికి పూర్తిగా తెలిసిందే.తన గ్లామర్ తో మాత్రం బాగా రచ్చ చేస్తుంది.

హాట్ యాంకర్స్ అనసూయ, శ్రీముఖి ల కంటే ఎక్కువ గ్లామర్ ను పరిచయం చేసింది వర్షిణి.సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ ప్రతిరోజు గ్లామర్ విందుని వడ్డిస్తుంది.

తన అందాలతో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తుంది.ఇక తనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.

మొదట సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీగా మారింది వర్షిణి.ఆ తర్వాత బుల్లితెరపై ప్రసారమైన రియాలిటీ షో ఢీ డాన్స్ లో కూడా యాంకరింగ్ చేసింది.

అందులో తన మాటలతో మరింత పరిచయం పెంచుకుంది.ఇక ఈ షో నుంచి బయటికి వచ్చాక మరో బుల్లితెర షో లో బాగా బిజీగా ఉంది.అందులో తన ఎంట్రీ డాన్స్ లతో మాత్రం ఓ రేంజ్ లో పిచ్చెక్కించింది.అందరి దృష్టి తన వైపు లాక్కుంది.వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.

అంతేకాకుండా పలు వెబ్ సిరీస్ లలో కూడా చేసింది.

ఇక సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫోటోలతో, ఫన్నీ వీడియోలతో బాగా రచ్చ చేస్తుంది.పొట్టి పొట్టి దుస్తులతో హాట్ లుక్ లతో బాగా రెచ్చిపోతుంది.

సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఇక తను సోషల్ మీడియాలో చేసే అల్లరి అంతా ఇంతా కాదని చెప్పవచ్చు.

తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ వీడియో షేర్ చేసింది.అందులో తను ఓ సినిమాలోని డైలాగ్ చెబుతున్నట్లు కనిపించింది.ఇక ఆ డైలాగు కు తాను చెబుతున్న స్టైలు, ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ను చూసి తన అభిమానులు తెగ ఫిదా అయ్యారు.పైగా అందులో డైలాగ్ చాలా ఫన్నీగా ఉండడంతో నెటిజన్లు తన వీడియో కు లైక్ లతో పాటు కామెంట్స్ కూడా పెడుతున్నారు.

ఇక కొందరు వర్షిణి లో ఇటువంటి టాలెంట్ కూడా ఉందా అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇక వర్షిణి కి తెలుగులో ఒక పాన్ ఇండియా సినిమాలో అవకాశం కూడా వచ్చింది.

అంతేకాకుండా పలు ప్రాజెక్ట్ లలో అవకాశాలు కూడా అందుకుంటుందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube