ఐపీఎల్ సీజన్ 15 మరో మూడు వారాల్లో స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో క్రికెటర్లు ప్రాక్టీస్ మొదలెట్టేశారు.ఈ లీగ్ లో మొట్టమొదటి మ్యాచ్ ముంబైలోని వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది.
దీంతో ఈ రెండు జట్లు ఇప్పటికే ప్రాక్టీస్ సెషన్స్ ప్రారంభించేశాయి.వీళ్ల ప్రాక్టీస్ సెషన్లకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే ఇప్పుడు ఒక వీడియో మాత్రం అందరినీ తెగ ఆకట్టుకుంటోంది.అందులో ధోనీ కేవలం ఒంటిచేత్తో భారీ సిక్సర్ కొట్టాడు.
ఇది చూసిన నెటిజన్లు ధోనీ ఈజ్ బ్యాక్, మళ్లీ తన విశ్వరూపం ఏంటో చూపించడానికి ధోనీ సిద్ధమవుతున్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.విరాట్ కోహ్లీ, రహానే వంటి స్టార్ ప్లేయర్లు కూడా ఇప్పుడు సరిగా ఆడలేక సతమతమవుతున్నారు.
అలాంటిది ధోనీ భారీ షాట్లు ఆడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.
ప్రస్తుతం సీఎస్కే ప్లేయర్లు సూరత్ లోని లాలా బాయ్ కాంట్రాక్ట్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నారు.ఈ స్టేడియంలోని పిచ్ రియల్ మ్యాచ్ లు జరిగే ముంబై, పుణే వంటి పిచ్ లను పోలి ఉంటుంది.అందుకే ధోనీ సేన ఇక్కడే ప్రాక్టీస్ చేస్తోంది.
ఈ క్రమంలోనే ధోనీ భారీ షాట్లు ఆడుతున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యింది.ఈ వీడియోని దీప్తి రంజన్ అనే ఒక ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు.
వన్ హ్యాండెడ్ సిక్సర్ అని దీనికి క్యాప్షన్ జోడించారు.అయితే ధోనీ ఒంటి చేత్తో సిక్సర్ కొట్టిన వీడియో ని చూసి ఫాన్స్ ఫిదా అయిపోతున్నారు.
అలాగే ఈ వీడియో పై ఎక్కువగా కామెంట్లు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.దీనికి ఇప్పటికే 300పైగా లైకులు వచ్చాయి.
ఈ వీడియో పై మీరు కూడా ఒక లుక్కేయండి.